Share News

Fashion : పట్టు పరికిణీలో..

ABN , Publish Date - May 29 , 2024 | 05:37 AM

పట్టు చీరలు ఎంత అందంగా ఉంటాయో, పట్టు పరికిణీలు, లెహంగాలూ అంతకంటే రెట్టింపు అందంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా సంప్రదాయ వేడుకల్లో అమ్మాయిలు మరింత

Fashion : పట్టు పరికిణీలో..

పట్టు చీరలు ఎంత అందంగా ఉంటాయో, పట్టు పరికిణీలు, లెహంగాలూ అంతకంటే రెట్టింపు అందంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా సంప్రదాయ వేడుకల్లో అమ్మాయిలు మరింత ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఇలాంటి పట్టు దుస్తుల్నే ఎంచుకోవాలి.

నగ ధగలు

పట్టు లెహంగా, ఓణీలకు అచ్చంగా బంగారంతో తయారైన నగలైతే బాగుంటాయి. బుట్ట కమ్మలు, మామిడి పిందెల డిజైన్లు, ముత్యాల నగలు సూటవుతాయి. అయితే మరీ భారీగా కాకుండా వీలైనంత సింపుల్‌ ఆభరణాలనే ఎంచుకోవాలి. చేతులకు గాజులు, పాదాలకు పట్టీలు తప్పనిసరి. పాపటి బిళ్ల, వంకీలు, వడ్డాణాలు లాంటివి పెళ్లిళ్లు, పుట్టిన రోజులు, రిసెప్షన్లకు ధరించవచ్చు.

పాత పట్టు చీరలతో...

పట్టు లెహంగా, ఓణీల మెటీరియల్‌ కొని, నచ్చిన డిజైన్‌లో కుట్టించుకోవడం ఒక పద్ధతి. బీరువాలో దాచిన పాత పట్టు చీరలతో లెహంగా, ఓణీ కుట్టించుకోవడం చవక పద్ధతి. నిజం చెప్పాలంటే, పాతవైపోయాయని వేలు పోసి కొన్ని పట్టు చీరలను బీరవాల్లో దాచే బదులు, ఇలా డిజైన్‌ చేయించుకుంటే, పాత జ్ఞాపకాలకు కొత్త రూపం ఇచ్చిన వాళ్లం అవుతాం. అయితే ఒంటికి అద్దినట్టు, కొలతలు చెదరకుండా కుట్టించుకోవాలి. అందుకోసం అనుభవజ్ఞులైన దర్జీలను వెతుక్కోవాలి. బ్లౌజ్‌కు డోరీ, కొంత డిజైన్‌ వర్క్‌ చేయించుకుంటే పెళ్లి లాంటి భారీ వేడుకల్లో ధరించడానికి కూడా ఈ పట్టు పరికిణీలు అనువుగా ఉంటాయి.

కాంట్రాస్ట్‌ రంగుల్లో...

పట్టు లెహంగా, ఓణీ, బ్లౌజ్‌ కాంట్రాస్ట్‌ రంగుల్లో ఉంటేనే అందం. కాబట్టి పాత పట్టు చీరతో కుట్టించేటప్పుడు, కాంట్రాస్ట్‌ పవిటను బ్లౌజ్‌ కోసం వాడుకోవాలి. వెడల్పాటి జరీని బ్లౌజ్‌ హ్యాండ్స్‌కు ఉపయోగించుకోవాలి. అలాగే లెహంగాకు కూడా డోరీలు కుట్టించుకోవాలి. మరింత ఎట్రాక్టివ్‌గా కనిపించడం కోసం విడిగా మ్యాచింగ్‌ పట్టు ఓణీ కొనుక్కోవాలి. ఆ ఓణీ ఇటు లెహంగాకూ, అటు బ్లౌజ్‌కూ మ్యాచ్‌ అయ్యేలా ఉండాలి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, మెహందీ... ఇలాంటి రంగులైతే వేడుకల్లో నలుగురినీ ఆకటు కుంటాయి. ఎరుపు - హాఫ్‌ వైట్‌, ఆకుపచ్చ - పసుపు లాంటి కాంట్రాస్ట్‌ రంగులైతే బాగుంటాయి.

Updated Date - May 29 , 2024 | 05:37 AM