Share News

ముక్తి సాధన కోసం... గకార చతుష్టయం

ABN , Publish Date - Jul 26 , 2024 | 05:06 AM

మానసిక, నైతిక పరమోన్నత స్థితే ముక్తి. అంటే... వ్యక్తి తన సహజత్వాన్ని పొందగలగడం. దీనికి మూలాధారం ఆత్మ నివేదన. దైవం పట్ల పరిపూర్ణ ప్రేమను వ్యక్తపరచే రీతి. భక్తి మార్గాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటికన్నా నివేదన విధానమే భగవంతుడిని, భక్తుడిని...

ముక్తి సాధన కోసం... గకార చతుష్టయం

వేదమాత

గాయత్రీదేవి వేదమాతగా ప్రశస్తి అందుకుంది. ‘గయలు’ అంటే ప్రాణాలు. ‘త్రాయతే’ అనే పదానికి పరిరక్షణ అని అర్థం. అందుకే ప్రాణ సంరక్షకురాలుగా గాయత్రిని ఆరాధిస్తారు. గాయత్రీ మంత్రంలోని ‘‘ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యమ్‌’ను పరిశీలిస్తే... ‘ఓం (సర్వ రక్షణ), భూ (ఉనికి), భువ (జ్ఞాన రూపం), స్వ (ఆనంద స్వరూపం), తత్‌ (అటువంటి లక్షణ సమన్విత పరమేశుడు), సవితు (విశ్వ కర్త) వరేణ్యం (సర్వులతో ఆరాధనీయులు)’ అనే భావార్థాలు ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ సంప్రదాయ పరంగా, శాస్ర్తీయంగా కూడా ప్రామాణికాలు.

అనంత ఫలప్రదం

ఇక గోవింద నామం... ‘గ’కార చతుష్టయంలో దీని పాత్ర అనంతం. ‘శ్రీనివాసా, శ్రీవేంకటేశా, నిత్య నిర్మలా, భక్త వత్సలా, దినకర తేజా’ అని స్మరణలు చేస్తారు ఆరాధకులు. ‘గోవింద’ అంటే భూ పరిరక్షకుడు. వేదాల వల్ల ఘనతరుడనే అంతరార్థమూ ఉంది. గోవింద నామం అనంత ఫలప్రదం.

యోగవిద్యకు సంబంధించి సాధన చతుష్టయమనే మాట వివిపిస్తూ ఉంటుంది. వివేకంతో వ్యవహరించడం, యధాతథ స్థితిని గ్రహించగలగడం, సంపత్‌ లేదా సమతుల్యతను కోరుకోవడం, ఆత్మ జ్ఞాన ప్రాప్తికి పలు విధాలుగా ప్రయత్నించడం. ఇదంతా అభ్యాస సాధనాల క్రమం. వీటన్నిటి ఫలితంగా స్వయం పరిశీలన శక్తి విస్తారమవుతుంది. క్రమేణా ముక్తి ప్రాప్తికి మార్గం సులభతరంగా మారుతుంది.


మానసిక, నైతిక పరమోన్నత స్థితే ముక్తి. అంటే... వ్యక్తి తన సహజత్వాన్ని పొందగలగడం. దీనికి మూలాధారం ఆత్మ నివేదన. దైవం పట్ల పరిపూర్ణ ప్రేమను వ్యక్తపరచే రీతి. భక్తి మార్గాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటికన్నా నివేదన విధానమే భగవంతుడిని, భక్తుడిని అనుసంధానిస్తుంది. పత్రం, పుష్పం, ఫలం, చివరికి నీటినైనా భక్తితో సమర్పిేస్త ప్రీతిగా స్వీకరిస్తానన్నది గీతాచార్యుడి మాట. నిజానికి మనిషి శరీరం ఆకు వంటిదే. రాలిపోతుందే తప్ప, శాశ్వతం కాదు. అందువల్ల పత్ర అర్చనకు ఆ వ్యక్తి సంసిద్థం కావాలి. తన మనోవనంలోని మొగ్గను పుష్పంలా వికసింప చేయాలి. ఆ వికసిత పుష్పమే విజ్ఞాన ఫలంగా రూపాంతరం చెందడాన్ని సమర్పణగా వర్ణిస్తుంది మన భారతీయ ధార్మిక చింతన. పవిత్ర గీత, పావన గంగ, శక్తిదాయక గాయత్రి, స్ఫూర్తిప్రదాయ గోవింద స్మరణలకు మనను మనం సమర్పించుకుంటేనే జీవితాలకు ధన్యత. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భక్తి జ్ఞాన కర్మ యోగాదులు చాటి చెబుతున్నది ఇటువంటి ఆత్మ సమర్పణ పద్థతినే.

జంధ్యాల శరత్‌బాబు

99483 45013

Updated Date - Jul 26 , 2024 | 05:06 AM