Healthy Snack : ఇలా కూడా బరువు తగ్గొచ్చు
ABN , Publish Date - Oct 01 , 2024 | 12:23 AM
బరువు పెరగకుండా ఉండాంటే కడుపు మాడ్చుకోవలసిన అవసరం లేదు. ఆకలిని అదుపులో ఉంచే ఆరోగ్యకరమైన స్నాక్స్‌తో కూడా అదనపు క్యాలరీలు శరీరంలో పెరిగిపోకుండా నియంత్రించుకోవచ్చు. అయితే దీన్లో కూడా కొన్ని నియమాలు పాటించాలి.
హెల్తీ స్నాకింగ్

- భోజనానికీ భోజనానికీ మధ్య తినే స్నాక్స్ కచ్చితంగా ఆరోగ్యకరమైనవై ఉండాలి.
- ఒకసారి తినే స్నాక్స్ 200 క్యాలరీలను మాత్రమే కలిగి ఉండాలి. పరిమాణం కంటే నాణ్యతే ప్రధానమనే విషయం గుర్తు పెట్టుకోవాలి.
- చురుకైన జీవనశైలిని కొనసాగించే వాళ్లు, రోజుకు మూడు సార్లు స్నాక్స్ తీసుకోవచ్చు. గంటల తరబడి కూర్చుని పని చేసేవాళ్లు ఒక స్నాక్‌తో సరిపెట్టుకోవాలి.
- తాజా పండ్లు, సలాడ్, నట్స్, ఇలా తక్కువ కార్బ్స్, ఎక్కువ ఫైబర్ ఉండే పదార్థాలనే ఎంచుకోవాలి.
- ప్రాసెస్డ్ ఫుడ్స్ స్నాక్స్‌గా పనికి రావు. అలాగే చక్కెరతో తయారైనవీ మానేయాలి.