Summer Garden Tips : వేసవిలో మొక్కల పెరుగుదల బావుండాలంటే ఇలా చేయండి.. !
ABN , Publish Date - Mar 07 , 2024 | 03:51 PM
సూర్యరశ్మికి ఎక్కువ సమయం తగలడంతో, మొక్కలకు మరింత నీరు అవసరం. వేసవి కాలంలో, సాయంత్రం లేదా తెల్లవారుజామున చల్లని సమయంలో మొక్కలకు నీరు పెట్టడం మంచిది.
మొక్కలు ఇంటికి అందాన్నిస్తాయి. శ్వాస తీసుకోవడంలో సహకరిస్తాయి. కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుని, ఆక్సిజన్ విడుదల చేస్తాయి. కాలుష్యాన్ని తగ్గిస్తాయి. మరి ఇంత గొప్ప మొక్కలకు వేసవికాలం గడ్డుకాలమే.. సూర్యుని వేడికి మాడిపోతూ ఉంటాయి. ఈ సమయంలో గార్డెన్లో ఇష్టంగా పెంచుకునే మొక్కలకు మరింత శ్రద్ధ అవసరం. అసలు ఈ వేసవిలో మొక్కలను ఎలా కాపాడుకోవాలి. దానికి పాటించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం.
వేసవిలో మొక్కలకు (Garden Tips), శ్రద్ధ అవసరం. మండుతున్న వేసవి ఉష్ణోగ్రతలలో కూడా మొక్కలను ఆరోగ్యంగా ఉంచాలంటే..
1. కలుపు మొక్కలు..
మొక్కలు (Plants) మొదలులో పెరిగే కలుపు మొక్కలు ఈ కాలమనే కాదు. ఏ కాలమైన కూడా మామూలే. కలుపు మొక్కలు పండ్లు, పూలమొక్కల్లో ఉంటూనే ఉంటాయి. రసాయనాలతో కూడిన సింథటిక్ మల్చ్‌తో పోలిస్తే మొక్కలకు ఎటువంటి హాని కలిగించని కంపోస్ట్, ఆకులు, ఎండిన గడ్డి ముక్కలు, బెరడులను ఏరివేసి చిన్నపాటి గుంతలో వేసి పైన మట్టి కప్పితే నెమ్మదిగా ఎరువులా మారుతుంది.
2. ఎరువులు
మార్కెట్‌లో అనేక ఎరువులు అందుబాటులో ఉన్నాయి, కానీ మొక్కలకు సరిపోయేదాన్ని ఎంచుకోగలగాలి. వేసవిలో ఎరువులు నేల నీటిని నిలుపుకోవడంలో సహాయపడటానికి సహకరిస్తాయి. కలుపు మొక్కల పెరుగుదలను నియంత్రించడంలో ఎరువులు కూడా సహాయపడతాయి. వేసవికి అనుకూలమైన ఎరువులతో పాటు, మొక్కల పెరుగుదలను ఉత్తేజపరిచేందుకు నత్రజని ఎరువులను ఉపయోగించవచ్చు.
3. కూరగాయలు
వేసవి, వసంత రుతువులో మొక్కలు పెరగడానికి సరైన సమయం, ఈ కాలంలో కొన్ని కూరగాయలు బీన్స్, గుమ్మడికాయ, స్క్వాష్, సెలెరీ, మిరియాలు, మొక్కజొన్న త్వరగా పెరుగుతాయి. ఎందుకంటే ఈ కూరగాయలకు సూర్యరశ్మికి, వెచ్చని నేలకి ఎక్కువ బహిర్గతం కావాలి, కనుక ఇవి పండించడానికి వేసవిని సరైన సమయంగా అనుకోవచ్చు.
ఇది కూడా చదవండి: కాంతివంతమైన మెరిసే చర్మాన్ని పొందాలంటే ఈ బ్యూటీ చిట్కాలు పాటించి చూడండి..!
4. నీరు
సూర్యరశ్మికి ఎక్కువ సమయం తగలడంతో, మొక్కలకు మరింత నీరు అవసరం. వేసవి కాలంలో, సాయంత్రం లేదా తెల్లవారుజామున చల్లని సమయంలో మొక్కలకు నీరు పెట్టడం మంచిది. ఇది నేలలోకి నీరు చొచ్చుకుపోవడానికి, మొక్కల మూలాలను చేరుకోవడానికి సమయాన్ని ఇస్తుంది. మధ్యాహ్నం సమయంలో మొక్కలకు నీరు పోస్తే, సూర్యరశ్మి నీరు ఆవిరికి కారణమవుతుంది, అంటే నీరు మూలాలకు చేరదు. పైగా ఇది మొక్కలకు హాని.
ఇవి కూడా చదవండి:
నోటి ఆరోగ్యాన్ని పెంచే లవంగాలను గురించి తెలుసా..100 గ్రాముల లవంగాల్లో..!
ఆహారంతో పొటాషియం స్థాయిలను ఎలా పెంచాలి..!
యాపిల్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!
5. కత్తిరింపు
వేసవి కాలం ప్రారంభం కాగానే.. వీగెలా, ఫిలడెల్ఫస్‌తో సహా వసంతంలో పుష్పించే పొదలను కత్తిరించాలి. క్రాసింగ్, దెబ్బతిన్న కొమ్మలు ఉంటే, వాటిని కూడా కత్తిరించాలి. వేసవి కాలం మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి. మొక్క ఆరోగ్యకరమైన భాగాలు వ్యాధి బారిన పడకుండా చూసుకోవడానికి చనిపోయిన ఆకులు తొలగించాలి.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.
6. నేల తయారీ
మొక్కలకు నేల ఎలా తయారు చేసామనే దాన్ని బట్టే మొక్కల పెరుగుదల ఉంటుంది., ముఖ్యంగా వేసవి కాలంలో మట్టిని సిద్ధం చేస్తున్నప్పుడు గుడ్డు పెంకులు, కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు ఇతర సేంద్రీయ రక్షక కవచం వంటి సేంద్రీయ పదార్థాలను కలిపితే నేల సారవంతంగా ఉంటుంది.