Share News

Monsoon skincare : వానాకాలంలో ముఖ చర్మాన్ని ఇలా కాపాడుకుందాం.. !

ABN , Publish Date - Jun 28 , 2024 | 01:06 PM

సూర్యకాంతిలో చర్మం దెబ్బతినే అవకాశాలు చాలా ఉంటాయి. UVకాంతి చర్మానికి హాని కలిగిస్తుంది. దీని నుంచి రక్షణ పొందేందుకు కనీసం బయటకు వెళ్ళే 15 నిమిషాల నుందు సన్ స్క్రీన్ లోషన్ పూయడం మంచిది.

Monsoon skincare : వానాకాలంలో ముఖ చర్మాన్ని ఇలా కాపాడుకుందాం.. !
skin glow

కాలం ఏదైనా చర్మం నిగారింపుతో, అందంగా,కాంతివంతంగా ఉండాలని కోరుకుంటాం. దానికి తగిన విధంగా పోషణను అందిస్తాం. కానీ కాలాలన్నీ ఒకే విధమైన ప్రభావాన్ని కలిగి ఉండవు. ముఖం చర్మం గాలి, తేమ కారణంగా చాలా ప్రభావితం అవుతుంది. ఇది చర్మానికి చెడు చేయవచ్చు. ముఖ్యంగా ఎండాకాలంలో ఉన్న ఉక్కా, చెమట కారణంగా చర్మం నిగారింపు కాస్త తగ్గే ఉంటుంది. ఇక వచ్చే వానాకాలం మరింత కఠినమైనది.

వానాకాలం రాగానే వేసవి వేడి నుంచి తప్పించుకున్నాం అనుకుంటాంకానీ, ప్రకృతిలో కలిగే ఈ మార్పులు కాస్త ఆనందంగా ఉన్నా కూడా చర్మం మీద అతిగా ప్రభావం చూపుతుంది. వర్షాకాలం వేసవి వేడి నుండి ఉపశమనం కలిగినట్టుగా అనిపిస్తుంది కానీ గాలిలో తేలిన తేమ చర్మాన్ని చికాకు పెడుతుంది. వర్షపు నీరు, అధిక తేమ కారణంగా మెటిమలు, ఫంగల్ ఇన్ఫ్లెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి చర్మం రంగుతోసహా అనేక చర్మ సమస్యలకు కారణం కావచ్చు. దీనికి..

వర్షాకంల చర్మాన్ని పూర్తిగా శుభ్రం చేయాలంటే చర్మ రంథ్రాలను మూసుకుపోయేలా చేసే నూనె, మలినాలను తొలగించాలి. దీనికోసం క్లెన్సింగ్, టోనింగ్ చాలా ఉపయోగపడతాయి. చర్మాన్ని తాజాగా ఉంచడానికి PH సమతుల్య క్లెన్సర్ ను రోజుకు రెండుసార్లు ఉపయోగించాలి. ఇది చర్మం సమతుల్యతను పెంచడానికి సహకరిస్తుంది.

Herbs And Spices : కిడ్నీ, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఇవే..

వర్షాకాలంలో గాలి తేమగా ఉన్నప్పటికీ చర్మానికి తగినంత తేమ అవసరం. చర్మాన్ని జిడ్డుతనం నుంచి హైడ్రేట్ చేయడానికి మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి. చర్మాన్ని మృదువుగా, పోషణగా ఉఓంచడానికి హైలురోనిక్ యాసిడ్ వంటి తేమను ఆకర్షించే వీలుంటుంది. చర్మవ్యాధి నిపుణుల సలహాలను కూడా పాటిస్తూ ఉండాలి.

సూర్యకాంతిలో చర్మం దెబ్బతినే అవకాశాలు చాలా ఉంటాయి. UVకాంతి చర్మానికి హాని కలిగిస్తుంది. దీని నుంచి రక్షణ పొందేందుకు కనీసం బయటకు వెళ్ళే 15 నిమిషాల నుందు సన్ స్క్రీన్ లోషన్ పూయడం మంచిది. ఇది చర్మాన్ని నిగారింపు తగ్గకుండా చేస్తుంది.


Fatty Liver : కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరించే పండ్ల గురించి తెలుసా..!

చర్మం మీది మృత కణాలను తొలగించడానికి, రంధ్రాలను అన్ క్లాగ్ చేయడానికి వర్షాకాలంలో చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడం చాలా ముఖ్యం. అయినప్పటికీ కాస్త చర్మానికి చేటు చేసే స్క్రబ్స్ వాడకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇవి చర్మం మీద చికాకును కలిగిస్తాయి. ఎక్స్ ఫోలియేషన్ ఎక్కువగా చేయడం వల్ల చర్మం నిర్జీవంగా మారినా మారవచ్చు. కాబట్టి వారానికి ఒకటి, రెండుసార్లు మాత్రమే చేస్తూ ఉండాలి.

జిడ్డు తగ్గేలా చేయాలంటే ఆయిల్ ఫ్రీ ఫేస్ మాస్క్ ని వేసుకుంటూ ఉండాలి. ఇది మేకప్ ప్రభావం ముఖ చర్మం మీద పెద్దగా ఉండకుండా చేస్తుంది. రోజంతా నూనెను పీల్చుకునే బ్లాటింగ్ షీట్లను కూడా ఉపయోగిస్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు వానాకాలం తీసుకుంటే చర్మం మరింత నిగారింపుతో ఉంటుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 28 , 2024 | 01:07 PM