Littles : పచ్చటి గుర్రం
ABN , Publish Date - Sep 25 , 2024 | 03:53 AM
చతురతకు, చమత్కారానికి మారుపేరైన బీర్బల్, అక్బరు కొలువులో కొత్తగా చేరిన కొన్నిరోజులకు ఇద్దరూ వేటకు వెళ్లారు. అక్కడి ప్రకృతిని చూసి, మైమరచిపోయిన బీర్బల్ ‘ఇంత పచ్చని చెట్ల నడుమ, పచ్చటి కొండలలో ఒక ఆకు పచ్చని గుర్రం మీద వెళితే ఎంత మజాగా ఉంటుందో కదా’ అన్నాడు ఏదో ఆలోచిస్తూ.
Littles : చతురతకు, చమత్కారానికి మారుపేరైన బీర్బల్, అక్బరు కొలువులో కొత్తగా చేరిన కొన్నిరోజులకు ఇద్దరూ వేటకు వెళ్లారు. అక్కడి ప్రకృతిని చూసి, మైమరచిపోయిన బీర్బల్ ‘ఇంత పచ్చని చెట్ల నడుమ, పచ్చటి కొండలలో ఒక ఆకు పచ్చని గుర్రం మీద వెళితే ఎంత మజాగా ఉంటుందో కదా’ అన్నాడు ఏదో ఆలోచిస్తూ. ఆ మాటలు విన్న అక్బరు ‘ఏదీ పచ్చటి గుర్రం అన్నావే వారం రోజుల్లోగా నువ్వు నాకు, ఆ పచ్చటి గుర్రాన్ని తెచ్చి ఇవ్వాలి’ అని ఆజ్ఞాపించి ఇదెలా సాధిస్తాడో చూద్దాం అని లోలోపల నవ్వుకుంటాడు. వారం రోజులు గడిచాక బీర్బల్ హడావుడిగా కొలువుకు వచ్చి ‘జహాపనా.. ఒక చోట మీరడిగిన పచ్చటి గుర్రం దొరికింది.
కానీ ఆ గుర్రం యజమాని మీరు స్వయంగా వస్తేనే, గుర్రం అమ్ముతా అంటున్నాడు’ అని చెప్పాడు. అంత అరుదైన గుర్రం కోసం నేను రావడమే సముచితం, తప్పక వస్తాను అన్నాడు అక్బరు. కానీ అతను మీకు ఆ గుర్రాన్ని వారంలో ఎనిమిదవ రోజు మాత్రమే అమ్ముతాడట’ అన్నాడు బీర్బల్, అక్బరు ఇవాళ శుక్రవవారం రేపు శనివారం ఎనిమిదవ రోజు ఏదంటే అని లెక్క వేస్తూ ఒక్కసారిగా నాలిక క రుచుకుని, ‘‘వారంలో ఎనిుమిది రోజులు ఎలా ఉంటాయి నీ చమత్కారం కాకపోతే?’ అన్నాడు. దానికి బీర్బల్ మరి ఆకు పచ్చటి గుర్రం మాత్రం ఎలా ఉంటుంది జహాపనా? నేనేదో సరదాగా అంటే మీరు దాన్ని నిజంగా తీసుకురమ్మంటే నేనేంచేయగలను? అన్నాడు బీర్బల్.