చెట్టినాడ్ వెజ్ వెరైటీలు
ABN , Publish Date - Oct 05 , 2024 | 12:57 AM
పనీర్ (చిన్న ముక్కలు)- వంద గ్రాములు, కూరల ముక్కలు- 200 గ్రాములు, తరిగిన ఉల్లిపాయలు- వంద గ్రాములు, తరిగిన టమోటాలు- 100 గ్రాములు, తరిగిన పచ్చి మిరపకాయలు- ఐదు, తరిగిన కొత్తిమీర - పావు కప్పు, ఆవాలు- రెండు స్పూనులు, కరివేపాకు- ఒక పావు కప్పు, కొబ్బరి పొడి- రెండు స్పూనులు, గరం మసాలా- రెండు స్పూనులు, కారం- రెండు స్పూనులు, నూనె- తగినంత, ఉప్పు- తగినంత, రెడీ టూ ఈట్ పరోటాలు- ఎనిమిది, నీళ్లు- తగినన్ని
వెజ్ కొత్తు పరోటా
కావాల్సిన పదార్థాలు:

తయారీ విధానం
రెడీ టూ ఈట్ పరోటాలను నెయ్యి వేసి బాగా కాల్చాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
ఒక మూకుడులో కొద్దిగా నూనెను వేసి కాచాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఆ మిశ్రమంలో కూర ముక్కలు, పనీర్ ముక్కలను కూడా వేయాలి. మూకుడుపై మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి.
కూర ముక్కలు మగ్గిన తర్వాత దానిలో మసాలా, కారం, కొబ్బరిపొడి, ఉప్పు వేయాలి. కొద్దిగా నీళ్లు పోయాలి. ఈ మిశ్రమం బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత కాల్చిన పరోటా ముక్కలను వేయాలి.
ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కొత్తిమీర, కరివేపాకులను కూడా కలపాలి. వేడిగా ఉన్నప్పుడే దీనిని తింటే మంచి రుచిగా ఉంటుంది.
జాగ్రత్తలు
రెడీ టూ ఈట్ పరోటాలు అందుబాటులో లేకపోతే బాగా కాల్చిన చపాతీ ముక్కలను కూడా వాడుకోవచ్చు.
నీళ్లను సరిసమంగా పోయాలి. ఎక్కువ అయితే పలచన అయిపోతుంది. అందువల్ల నీళ్లు పోసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
దీనిని పెరుగుతో కలిపి తిన్నా చాలా బావుంటుంది.
చెఫ్ రాఘవేంద్ర
బార్‌బెక్యూ నేషన్
హైదరాబాద్