Share News

సజ్జన లక్షణాలు

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:57 AM

సజ్జనుల్లో సహజంగా ఉండే లక్షణాల గురించి ‘నీతి శతకం’లో భరృహరి వివరించిన శ్లోకం ఇది. దీన్ని... పొసగన్‌ దానము గుప్త మర్థి భవనంబు జేరుచో సంభ్రమో...

సజ్జన లక్షణాలు

సుభాషితం

ప్రదానం ప్రచ్ఛన్నం గృహ ముపగతే సంభ్రమవిధిః

ప్రియంకృత్వా మౌనం సదసి కథనం చాప్యుపకృతేః

అనుత్సేకో లక్ష్మ్యాం నిరభిభవసారాః పరకథాః

సతాం కేనోద్దిష్టం విషమ మసిధారావ్రత మిదమ్‌

సజ్జనుల్లో సహజంగా ఉండే లక్షణాల గురించి ‘నీతి శతకం’లో భరృహరి వివరించిన శ్లోకం ఇది. దీన్ని...

పొసగన్‌ దానము గుప్త మర్థి భవనంబు జేరుచో సంభ్రమో

ల్లసదుత్థానవిధానముం బ్రియవిధుల్‌ గావించి మౌనంబు రా

జసభన్‌ మిత్రకృత ప్రకాశనము గుత్సాకర్మ

వైముఖ్య మీ

యసిధారావ్రతచర్య యెవ్వడు మహార్యశ్రేణికిం దెల్పెనో... అంటూ ఏనుగు లక్ష్మణకవి సముచిత రీతిలో తెలుగువారికి సమర్పించాడు.

భావం: దానాలు చేస్తున్నానని చాటింపు వేసుకోకుండా రహస్యంగా చేయడం. ఇంటికి వచ్చి యాచించిన వారిని ఆదరించడం. వేరొకరికి తను చేసిన మేలు గురించి ప్రచారం చేసుకోకపోవడం, వేరొకరు తనకు చేసిన మేలును పదిమందికీ చెప్పడం, ఎన్ని సంపదలు వచ్చినా వినయంగా ఉండడం, పరుల గురించి చెడ్డగా మాట్లాడకపోవడం... వీటన్నిటినీ పాటించడం కత్తిమీద సాములాంటిది.


ఈ గుణాలు ఎవరో బోధిస్తేనో, నేర్పితేనో రావు. సజ్జనుల్లో ఈ లక్షణాలు స్వతస్సిద్ధంగా ఉంటాయి.

Updated Date - Jul 26 , 2024 | 04:57 AM