Share News

చతుర్వేదాల సారాంశం

ABN , Publish Date - Jul 26 , 2024 | 05:10 AM

మనిషి జన్మకు పరమార్థం ఏమిటన్నది చిరకాల ప్రశ్న. సమాధానాలు అనేకం ఉన్నా, ‘ముక్తి సాధన’ అనేది ఏ ఒక్కరూ కాదనలేనిది. దీనికి మరో పేరు ‘మోక్ష ప్రాపి’్త. జనన, మరణ బంధం నుంచి విమోచన పొందడం అన్నమాట. అంటే, ఆ చక్రం నుంచే బయటపడటం...

చతుర్వేదాల సారాంశం

చింతన

మనిషి జన్మకు పరమార్థం ఏమిటన్నది చిరకాల ప్రశ్న. సమాధానాలు అనేకం ఉన్నా, ‘ముక్తి సాధన’ అనేది ఏ ఒక్కరూ కాదనలేనిది. దీనికి మరో పేరు ‘మోక్ష ప్రాపి’్త. జనన, మరణ బంధం నుంచి విమోచన పొందడం అన్నమాట. అంటే, ఆ చక్రం నుంచే బయటపడటం. ఇది మాటలు, రాతలు కాదు... చేతలతోనే సాధ్యమవుతుంది. దీనికి ఏకైక మార్గం... ప్రతీ వ్యక్తి ఆత్మజ్ఞానం కలిగి ఉండడమే. ఎవరి గురించి వారు తెలుసుకోవాలంటే దైవశక్తినే సాధనంగా భావించాలి. తెలుసుకునే క్రమంలో మన ముందు నాలుగు మార్గాలు కనిపిస్తాయి.. అవన్నీ ‘గ’కారంతో మొదలయ్యేవే. అంటే... ‘గ’కార చతుష్టయం. అవి: గీత, గంగానది, గాయత్రీ మంత్రం, గోవింద నామం. నిత్యజీవితంలో వీటి స్మరణ మానవ జీవితానికి సార్థకత కలిగిస్తుందని భారతీయ సంస్కృతిని చాటి చెబుతోంది. అదే విషయాన్ని ‘ఆత్మ నివేదనం’ పేరిట విపులీకరిస్తోంది. ‘నివేదన’ అంటే ‘సమర్పణ’ అని అర్థం. మనసును, వాక్కును, కర్మను కేంద్రీకరించడం. ఈ కేంద్రీకరణ ద్వారానే స్వీయ పరిశీలన వేగవంతమవుతుంది.


చతుర్వేదాల సారాంశం

‘గ’కార చతుష్టయంలో మొదటిది భగవద్గీత. ఇందులో ఉన్నదంతా వేద విజ్ఞాన సారం. వేదాలు నాలుగు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం. ‘వేదం’ అనేది ‘విద్‌’ (తెలియడం) నుంచి ఏర్పడింది.

ఋుగ్వేదం అంటే దేవ వేదమే. ఇందులోని కొన్ని సూక్తాలు పురాణాలను, సామాజిక వర్తనను వివరిస్తాయి. యజుర్వేదం యజ్ఞ నిర్వహణ రీతిని తెలుపుతుంది. మధురతకు సూచిక సామ వేదం. అంతేకాక, సకల జ్ఞాన ప్రదాయని. అథర్వ(ణ) వేదం ఆ ఋషి పేరు మీదుగా వచ్చింది. ఇందులోనూ శాస్ర్తీయ పరిజ్ఞాన వైభవం కనిపిస్తుంటుంది. చతుర్వేదాల సారాంశ సమాహారం కాబట్టే.. భగవద్గీతకు అంతటి ప్రసిద్ధి, విశిష్టత కలిగాయి.


భువనపావని...

యమున, కృష్ణా, గోదావరి, కావేరి, సింధు, నర్మదలతో పాటు సప్త నదుల్లో ఒకటి గంగ. ‘భువన పావని’, ‘అనంత వాహిని’ అనేవి దాని నామాంతరాలు. మన సంస్క్కతి, చరిత్ర, వ్యవస్థ అంతా గంగానదితో మమేకమై ఉంది. గంగమ్మ తల్లిగా, గంగా భవానీగా పిలిచేది అందుకే. గంగను నీటికి పర్యాయపదంగా మనం ఉపయోగిస్తాం.. గంగ మరెన్నో నదులతో కలసి మహా ప్రవాహంగా మారుతుంది. ఆ జల స్నానం భారతీయులకు పరమ పవిత్రం. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ స్థలాన (త్రివేణి) కుంభ మేళాలు ఏర్పాటవుతుంటాయి. అలహాబాద్‌ (ప్రయాగ)లో ఈ మహోత్సవం వచ్చే ఏడాది జనవరిలో మొదలవుతుంది. ఇంతటి మేటి విశిష్టత కారణంగా... గంగ విశ్వ విఖ్యాతి పొందింది.

Updated Date - Jul 26 , 2024 | 05:10 AM