Share News

నేటి అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి

ABN , Publish Date - Oct 05 , 2024 | 12:31 AM

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారు... శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజున అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు.

నేటి అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి

  • దేవీ నవరాత్రులు

  • అశ్వయుజ శుద్ధ తదియ, శనివారం

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారు... శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజున అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, సర్వజీవనాధారం. జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించినది ఏదీ లేదు. అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు. అన్నాన్ని ప్రసాదించే మాతృమూర్తి... శ్రీఅన్నపూర్ణాదేవి. ఎడమ చేతిలో అమృతాన్నం ఉన్న బంగారు పాత్రతో, కుడి చేతిలో వజ్రాలు పొదిగిన గరిటతో... ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత. ఆమె నిత్యాన్నదానేశ్వరి. సాక్షాత్తూ శివ స్వరూపిణి. ఈ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శిస్తే... అన్నాదులకు లోటు లేకుండా ఉంటుందని భక్తుల నమ్మిక. ఆ తల్లిని ధ్యానిస్తే ధన , ధాన్య వృద్ధి, మధుర భాషణం, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయని పెద్దలు చెబుతారు. అన్నపూర్ణాదేవిని కుంకుమతో పూజించాలి. జ్ఞానభిక్ష పెట్టాలనీ, వైరాగ్యం కలగజేయాలనీ కోరుకోవాలి.

  1. నైవేద్యం: కట్టె పొంగలి, పరమాన్నం

  2. అలంకరించే చీర రంగు: ఎరుపు

  3. అర్చించే పూల రంగు: తెలుపు

  4. పారాయణ: చేయాల్సినవి: అన్నపూర్ణాష్టకం

Updated Date - Oct 05 , 2024 | 12:31 AM