Share News

London: హైదరాబాద్ యువకుడికి 16 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

ABN , Publish Date - Apr 27 , 2024 | 06:25 PM

మాజీ గర్ల్‌ ఫ్రెండ్‌ని హత్య చేసేందుకు యత్నించిన హైదారబాద్ యువకుడికి లండన్ కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో కత్తితో తిరుగుతున్నందుకు మరో 12 మాసాల జైలు శిక్షను అతడికి కోర్టు విధించింది.

London: హైదరాబాద్ యువకుడికి 16 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

లండన్, ఏప్రిల్ 27: మాజీ గర్ల్‌ ఫ్రెండ్‌ని హత్య చేసేందుకు యత్నించిన హైదారబాద్ యువకుడికి లండన్ కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో కత్తితో తిరుగుతున్నందుకు మరో 12 మాసాల జైలు శిక్షను అతడికి కోర్టు విధించింది.

హైదరాబాద్‌కు చెందిన శ్రీరామ్ అంబర్ల ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లాడు. మలయాళీ విద్యార్థితో సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే అతడి ప్రవర్తన హద్దులు దాటింది. దీంతో 2019లో వారి విడిపోయారు. అనంతరం అమె నివాసానికి వెళ్లి.. ఆమెపై భౌతికంగా దాడి చేస్తున్నాడు.

LokSabha Elections: ముచ్చటగా మూడోసారి మోదీని ప్రధానిని చేస్తే..

అలాగే తనను వివాహం చేసుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకు వస్తున్నాడు. పెళ్లి చేసుకోకుంటే ఊరుకోనేది లేదని బెదిరిపులు, బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. అతడిని వివాహం చేసుకొనేందుకు ఆమె నిరాకరించింది. ఆ క్రమంలో ఆమె పని చేస్తున్న ఈస్ట్ లండన్ రెస్టారెంట్‌కు శ్రీరామ్ వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని మళ్లీ మళ్లీ బెదిరంచాడు.


అందుకు ససేమీరా అంది. నీవు పెట్టే ఆంక్షలతో కలిసి జీవించడం సాధ్యం కాదని శ్రీరామ్‌ ముఖం మీద చెప్పేసింది. దాంతో అతడు ఆగ్రహంతో ఊగిపోతూ.. మలయాళీ విద్యార్థిపై విచాక్షణారహితంగా కత్తితో దాడి చేసి పలుమార్లు పొడిచాడు. అలాగే ఆమె గొంతును సైతం కోసేశాడు.

దీంతో ఆమె రక్తపు మడుగులో పడిపోయింది. స్థానికుల ఫిర్యాతుతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు.. శ్రీరామ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో విచారణ అనంతరం శ్రీరామ్‌కు లండన్ కోర్టు శిక్ష విధించింది.

LokSabha Elections: ఢిల్లీలో ఆప్ గెలుపు కోసం..

అయితే ఆ విద్యార్థిని హత్యకు ఉపక్రమించే ముందు.. లండన్‌లో విదేశీయులను హత్య చేస్తే ఏమవుతుంది?, కత్తిలో ఎవరినైనా సులువుగా హత్య చేయవచ్చా? కత్తితో మనుషులను అప్పటికప్పుడు హత్య చేయడం ఎలా తదితర అంశాలను రామ్ ఆన్ లైన్లో వెతికినట్లు కోర్టు స్పష్టం చేసింది.

LokSabha Elections: మమతా బెనర్జీకి మళ్లీ గాయాలు!

అయితే మరో మహిళ విషయంలో ఈ తరహా ఘటన చోటు చేసుకోకూడదనే ఉద్దేశ్యంతో శ్రీరామ్‌కు జీవిత ఖైదు విదించినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఇక 2016లో భారత్‌లో శ్రీరామ అంబర్ల, మలయాళి విద్యార్థి ఇంజనీరింగ్ పూర్తి చేసిన.. లండన్ వెళ్లారని కోర్టు గుర్తు చేసింది.

Read National News And Telugu News

Updated Date - Apr 27 , 2024 | 06:27 PM