AP Floods: రైతుల కోసం పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్న నిరసన

ABN, Publish Date - Jul 24 , 2024 | 05:12 PM

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడ తెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. భారీ వర్షాలతో నష్ట పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఆ క్రమంలో బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలంటూ.. నడుంలోతు నీళ్లలోకి దిగి తన వినూత్నం నిరసనను తెలిపారు.

AP Floods: రైతుల కోసం పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్న నిరసన 1/9

నీట మునిగిన పంట పొలాల్లోకి వెళ్తున్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

AP Floods: రైతుల కోసం పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్న నిరసన 2/9

నీట మునిగిన పంట పొలాల్లోకి వెళ్లి.. తన నిరసన తెలిపేందుకు సిద్దమవుతున్న షర్మిల

AP Floods: రైతుల కోసం పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్న నిరసన 3/9

తన భద్రత సిబ్బందితో మాట్లాడుతున్న వైఎస్ షర్మిల

AP Floods: రైతుల కోసం పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్న నిరసన 4/9

భారీ వర్షాలు, వరదలతో నీటి మునిగిన వరి కంకులను షర్మిలకు అందిస్తున్న రైతులు

AP Floods: రైతుల కోసం పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్న నిరసన 5/9

వరి కంకులను పరిశీలించి.. రైతులతో మాట్లాడుతున్న షర్మిల

AP Floods: రైతుల కోసం పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్న నిరసన 6/9

వరి కంకులు చేతపట్టి.. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న వైఎస్ షర్మిల

AP Floods: రైతుల కోసం పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్న నిరసన 7/9

పంట పొలాలు ఎంత మేర నీటి మునిగి పోయాయో.. మీడియాకు చూపిస్తున్న షర్మిల

AP Floods: రైతుల కోసం పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్న నిరసన 8/9

పంట నీట మునగడంతో.. రైతులకు నష్ట పరిహారం అందించాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేేస్తున్న వైఎస్ షర్మిల

AP Floods: రైతుల కోసం పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్న నిరసన 9/9

మీడియా ప్రశ్నలను సావదానంగా వింటున్న వైఎస్ షర్మిల

Updated at - Jul 26 , 2024 | 11:12 AM