Justice Amarnath Goud: త్రిపుర హైకోర్టు న్యాయమూర్తికి అరుదైన రికార్డు

ABN, Publish Date - Nov 17 , 2024 | 10:44 AM

త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్‌కు అరుదైన రికార్డు దక్కింది.. న్యాయమూర్తిగా అత్యధిక కేసులు పరిష్కరించి జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ రికార్డ్‌ సృష్టించారు..

Justice Amarnath Goud: త్రిపుర హైకోర్టు న్యాయమూర్తికి అరుదైన రికార్డు 1/5

తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు.. జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌కు యూకే వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటు దక్కింది.. 2017 నుంచి ఇప్పటివరకు 92వేల కేసులు పరిష్కరించారు జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌ తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందినవారు.

Justice Amarnath Goud: త్రిపుర హైకోర్టు న్యాయమూర్తికి అరుదైన రికార్డు 2/5

ఈ సందర్భంగా తన బెంచ్‌లో పెండింగ్ కేసులు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌ తెలిపారు.

Justice Amarnath Goud: త్రిపుర హైకోర్టు న్యాయమూర్తికి అరుదైన రికార్డు 3/5

జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ 2017లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టుకు న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2021 అక్టోబర్ 28న జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ త్రిపుర హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు.

Justice Amarnath Goud: త్రిపుర హైకోర్టు న్యాయమూర్తికి అరుదైన రికార్డు 4/5

నవంబర్ 11, 2022 నుంచి ఏప్రిల్ 16, 2023 వరకు త్రిపుర తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టులో 40 పెండింగ్ కేసులను పరిష్కరించగా.. త్రిపుర హైకోర్టులో 60 శాతం కేసుల్లో తీర్పు వెల్లడించారు.

Justice Amarnath Goud: త్రిపుర హైకోర్టు న్యాయమూర్తికి అరుదైన రికార్డు 5/5

జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ అత్యధిక కేసులను పరిష్కరించడంపై ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదగాలని కోరుకున్నారు. యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచిస్తున్నారు.

Updated at - Nov 17 , 2024 | 10:45 AM