Group-3: ప్రశాంతంగా గ్రూప్‌-3 పరీక్షలు.. 50శాతం హాజరు

ABN, Publish Date - Nov 18 , 2024 | 07:25 AM

తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్‌ 3 పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. మొదటి పేపర్‌కు 51%, రెండో పేపర్‌కు 50 శాతం మంది హాజరైనట్లు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ తెలిపారు.

Group-3: ప్రశాంతంగా గ్రూప్‌-3 పరీక్షలు..  50శాతం హాజరు 1/8

మొదటి పేపర్‌కు 2.73 లక్షల మంది, రెండో పేపర్‌కు 2.72 లక్షల మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 64.5%, హైదరాబాద్‌లో అత్యల్పంగా 41% మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.

Group-3: ప్రశాంతంగా గ్రూప్‌-3 పరీక్షలు..  50శాతం హాజరు 2/8

కూకట్‌పల్లి ప్రతిభ కాలేజ్‌లో గ్రూప్ 3 పరీక్ష రాసేందుకు వచ్చిన భార్య భర్తలు. అయితే ఉదయం నుంచి పిల్లలు ఇద్దరూ పరీక్ష కేంద్రం వద్దనే వేచి ఉన్నారు వారికి తోడుగా నిలిచిన పోలీసులు.

Group-3: ప్రశాంతంగా గ్రూప్‌-3 పరీక్షలు..  50శాతం హాజరు 3/8

రంగారెడ్డి జిల్లా శేరిగూడలోని శ్రీదత్త ఇంజినీరింగ్‌ కళాశాల పరీక్షా కేంద్రానికి నలుగురు అభ్యర్థులు 9.30 తర్వాత చేరుకున్నారు. అధికారులు అనుమతించకపోవడంతో అభ్యర్థులు నిరాశగా వెనుదిరిగారు.

Group-3: ప్రశాంతంగా గ్రూప్‌-3 పరీక్షలు..  50శాతం హాజరు 4/8

వికారాబాద్‌ జిల్లాలో ఆలస్యంగా వచ్చిన 65 మంది పరీక్ష రాసే అవకాశం కోల్పోయారు. మేడ్చల్‌ జిల్లాలోని ఓ జూనియర్‌ కాలేజీ పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు తాము ఎడిట్‌ ఆప్షన్‌లో పెట్టుకున్న విధంగా పేపర్లు ఇవ్వాలని కోరడంతో కాసేపు గందరగోళం ఏర్పడింది.

Group-3: ప్రశాంతంగా గ్రూప్‌-3 పరీక్షలు..  50శాతం హాజరు 5/8

జేఎన్టీయూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. మహబూబ్‌నగర్‌లోని ఎన్టీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్దకు ఓ యువతి పరిగెత్తుకుంటూ వచ్చే క్రమంలో స్పృహ తప్పింది.

Group-3: ప్రశాంతంగా గ్రూప్‌-3 పరీక్షలు..  50శాతం హాజరు 6/8

నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన భార్యాభర్తలు గ్రూప్‌-3 పరీక్ష రాయాల్సి ఉండగా, భార్యకు అనుమతి నిరాకరించగా, ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్లిన భర్తను లోపలికి అనుమతించారు.

Group-3: ప్రశాంతంగా గ్రూప్‌-3 పరీక్షలు..  50శాతం హాజరు 7/8

గ్రూప్‌- 3 పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక అధికారులు, రూట్‌ ఆఫీసర్లు, అన్ని పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, ఫ్లయింగ్‌ స్క్వా డ్లు పర్యవేక్షించారు. గ్రూప్‌- 3 పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని టీజీపీఎస్సీ ఆదేశించింది.

Group-3: ప్రశాంతంగా గ్రూప్‌-3 పరీక్షలు..  50శాతం హాజరు 8/8

తల్లిదండ్రులు ఇద్దరూ పరీక్షకు వెళ్లగా పిల్లలను చూసుకోవడానికి ఎవరు లేకపోవడంతో నేను చూసుకుంటాను మీరు వెళ్లండి అని ధైర్యం చెప్పి వారి ఓక్కన కూర్చున్న పోలీస్ ఉన్నతాధికారి.

Updated at - Nov 18 , 2024 | 07:25 AM