Share News

Asia Cup Final : ఫేవరెట్‌ భారత్‌

ABN , Publish Date - Jul 28 , 2024 | 06:07 AM

ఆసియా కప్‌లో ఎదురులేని డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ అమ్మాయిలు మరో టైటిల్‌పై గురిపెట్టారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టును ఎదుర్కోనున్నారు.

Asia Cup Final : ఫేవరెట్‌ భారత్‌

శ్రీలంకతో ఆసియా కప్‌ ఫైనల్‌ నేడు

దంబుల్లా: ఆసియా కప్‌లో ఎదురులేని డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ అమ్మాయిలు మరో టైటిల్‌పై గురిపెట్టారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టును ఎదుర్కోనున్నారు. ఈసారి టోర్నీలో అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన హర్మన్‌సేనను టైటిల్‌ ఫైట్‌లో హాట్‌ ఫేవరెట్‌గా అంచనా వేస్తున్నారు. టాపార్డర్‌ బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా సత్తా చాటుతుండడంతో భారత్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు శక్తికి మించి పని అవుతోంది. కాగా.. రెండేళ్ల కిందట జరిగిన ఫైనల్లోనూ శ్రీలంకను ఓడించి మనోళ్లు టైటిల్‌ అందుకోవడం విశేషం.

Updated Date - Jul 28 , 2024 | 06:07 AM