Share News

Indian hockey team : ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ABN , Publish Date - Aug 03 , 2024 | 06:11 AM

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ అద్భుత ప్రదర్శనతో భారత హాకీ జట్టు తమ చివరి పూల్‌ ‘బి’ మ్యాచ్‌లో అదరగొట్టింది. 1972 ఒలింపిక్స్‌ తర్వాత..

Indian hockey team : ఎన్నాళ్లకెన్నాళ్లకు..

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ అద్భుత ప్రదర్శనతో భారత హాకీ జట్టు తమ చివరి పూల్‌ ‘బి’ మ్యాచ్‌లో అదరగొట్టింది. 1972 ఒలింపిక్స్‌ తర్వాత.. అంటే 52 ఏళ్ల అనంతరం తొలిసారిగా ఆస్ట్రేలియాపై 3-2తో గెలిచింది. టోక్యో గేమ్స్‌లో రజతం సాధించిన ఆసీస్‌పై ఆరంభం నుంచే అటాకింగ్‌ గేమ్‌తో భారత్‌ ఆధిక్యం చూపించింది. అభిషేక్‌ (12వ నిమిషంలో), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (13వ, 33వ) భారత్‌కు గోల్స్‌ అందించారు. బెల్జియం టేబుల్‌ టాపర్‌గా ఉండగా, 9 పాయింట్లతో ఉన్న భారత్‌ రెండో స్థానంతో గ్రూప్‌ దశను ముగించే చాన్స్‌ ఉంది. ఈ పూల్‌ నుంచి ఇప్పటికే భారత్‌, బెల్జియం, ఆస్ట్రేలియా క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. క్వార్టర్స్‌లో భారత్‌కు జర్మనీ లేదా బ్రిటన్‌ ఎదురయ్యే అవకాశం ఉంది.

Updated Date - Aug 03 , 2024 | 06:11 AM