Share News

Gautam Gambhir: సూర్యను కెప్టెన్‌ చేయాలని అడగలేదు కానీ, పాండ్యా గురించి గంభీర్ ఏం చెప్పాడంటే..

ABN , Publish Date - Jul 20 , 2024 | 10:49 AM

టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు. దీంతో రోహిత్ స్థానంలో కెప్టెన్‌గా నియమితుడయ్యేది ఎవరంటూ పెద్ద చర్చ జరిగింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యానే టీమిండియా టీ20 కెప్టెన్ అవుతాడని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ తెర పైకి వచ్చాడు.

Gautam Gambhir: సూర్యను కెప్టెన్‌ చేయాలని అడగలేదు కానీ, పాండ్యా గురించి గంభీర్ ఏం చెప్పాడంటే..
Gautam Gambhir

టీ20 ప్రపంచకప్ (T20 Worldcup) తర్వాత అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రోహిత్ శర్మ (Rohit Sharma) వీడ్కోలు పలికాడు. దీంతో రోహిత్ స్థానంలో కెప్టెన్‌గా (Captain) నియమితుడయ్యేది ఎవరంటూ పెద్ద చర్చ జరిగింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)నే టీమిండియా టీ20 కెప్టెన్ అవుతాడని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తెర పైకి వచ్చాడు. సూర్యను కెప్టెన్‌గా నియమిస్తూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. హార్దిక్ పాండ్యాను కనీసం వైస్-కెప్టెన్‌గా కూడా నియమించలేదు. త్వరలో జరగబోయే శ్రీలంక సిరీస్ వరకే ఈ నిర్ణయమా? లేదా సూర్యను పూర్తి స్థాయి కెప్టెన్‌గా కొనసాగిస్తారా? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.


ఏదేమైనా హార్దిక్‌ను కాదని, సూర్యను కెప్టెన్‌గా నియమించడం వెనుక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పాత్ర ఉందని చాలా మంది భావించారు. అయితే తాజాగా ఓ విషయం బయటకు వచ్చింది. సూర్యనే కెప్టెన్‌గా నియమించాలని గంభీర్ డైరెక్ట్‌గా అడగలేదట. ``సూర్యను కెప్టెన్ చేయాలని గంభీర్ డైరెక్ట్‌గా అడగలేదు. కానీ, ఎవరికైతే తక్కువ పనిభారం ఉంటుందో వారిని కెప్టెన్ చేయాలని గంభీర్ కోరాడు. దాంతో అగార్కర్ అర్థం చేసుకున్నాడు`` అంటూ బీసీసీఐకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.


ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ జట్టు బాధ్యతలు కూడా పాండ్యా చూడాల్సి ఉంటుంది. సూర్య ఐపీఎల్‌లో ఏ జట్టుకూ నాయకత్వం వహించడం లేదు. గతంలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యా ఆ జట్టుకు ట్రోఫీ అందించాడు. ఆ తర్వాత ముంబై టీమ్‌కు కెప్టెన్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు.

ఇవి కూడా చదవండి..

Harbhajan Singh: ఇది చాలా చెత్త ప్రశ్న.. ధోనీతో అతడికి పోలికా?.. పాక్ జర్నలిస్ట్‌కు హర్భజన్ కౌంటర్!


Ishan Kishan: ఇషాన్ కిషన్ మళ్లీ జట్టులోకి రావడానికి మార్గాలున్నాయా? అలా చేస్తేనే ఇక ఛాన్స్..!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 20 , 2024 | 10:49 AM