Share News

Rahul Dravid: ద్రవిడ్ సర్‌ప్రైజింగ్ మెసేజ్.. ఎమోషనల్ అయిన గంభీర్.. వీడియో వైరల్!

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:59 PM

టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. చిరస్మరణీయ విజయంతో ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలోకి గౌతమ్ గంభీర్ ప్రవేశించాడు. గంభీర్ మార్గదర్శకత్వంలో టీమిండియా తొలి సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది.

Rahul Dravid: ద్రవిడ్ సర్‌ప్రైజింగ్ మెసేజ్.. ఎమోషనల్ అయిన గంభీర్.. వీడియో వైరల్!
Rahul Dravid, Gautam Gambhir

టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీ కాలం ముగిసింది. చిరస్మరణీయ విజయంతో ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ (head coach) పదవి నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలోకి గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రవేశించాడు. గంభీర్ మార్గదర్శకత్వంలో టీమిండియా తొలి సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో గంభీర్‌కు మాజీ కోచ్ ద్రవిడ్ నుంచి ఓ స్పెషల్ మెసేజ్ వచ్చింది. ఆ స్పెషల్ వాయిస్ మెసేజ్ విన్న గంభీర్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వీడియోను బీసీసీఐ (BCCI) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.


``హలో గౌతమ్.. ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహవంతమైన ఉద్యోగంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నా. మూడు వారాల క్రితం టీమిండియాతో నా ప్రయాణం ముగిసింది. ఎంతో గొప్పగా బార్బొడాస్‌లో నా పదవీ కాలాన్ని ముగించా. ఆ తర్వాత ముంబైలోని జరిగిన వేడుకను ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు కొత్త కోచ్‌గా నువ్వు బాధ్యతలు చేపట్టావు. నువ్వు కూడా అద్భుతమైన సమయాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నా. మైదానంలో నువ్వు ఎంత అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలవో తోటి ఆటగాడిగా చూశా. ఓటమిని అంగీకరించని నీ నైజం గురించి తెలుసు`` అని ద్రవిడ్ పేర్కొన్నాడు.


``భారత క్రికెట్‌పై నీకున్న అంకితభావం గురించి నాకు తెలుసు. ఐపీఎల్‌లో కోచ్‌గా నువ్వు సాధించిన విజయాలు తెలుసు. మనపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో నీకు తెలుసు. క్లిష్ట పరిస్థితుల్లో నీకు సహాయక సిబ్బంది, ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్ నుంచి ఎప్పుడూ మద్దతు ఉంటుంది. నీకు కొంచెం కష్టమైనా సరే.. అప్పుడప్పుడు చిరునవ్వుతో కనిపించు`` అంటూ ద్రవిడ్ ఆ వాయిస్ మెసేజ్‌లో పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి..

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు బీహార్ ఎమ్మెల్యే.. షూటింగ్‌లో స్వర్ణ పతకమే టార్గెట్!


Shoaib Malik: మేం చాలా మంచి వాళ్లం.. టీమిండియాకు చక్కని ఆతిథ్యం అందిస్తాం: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 27 , 2024 | 01:59 PM