Share News

హాడ్జ్‌ శతకం

ABN , Publish Date - Jul 20 , 2024 | 05:24 AM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌ దీటుగా బదులిస్తోంది. కెరీర్‌లో నాలుగో టెస్టు ఆడుతున్న మిడిలార్డర్‌ బ్యాటర్‌ కవెమ్‌ హాడ్జ్‌ (120) శతకంతో అదరగొట్టగా.. అథనజె (82) అర్ధశతకంతో రాణించాడు. దీంతో శుక్రవారం రెండోరోజు ఆట ముగిసేసరికి విండీస్‌ తొలి

హాడ్జ్‌ శతకం

విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 351/5

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు

నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌ దీటుగా బదులిస్తోంది. కెరీర్‌లో నాలుగో టెస్టు ఆడుతున్న మిడిలార్డర్‌ బ్యాటర్‌ కవెమ్‌ హాడ్జ్‌ (120) శతకంతో అదరగొట్టగా.. అథనజె (82) అర్ధశతకంతో రాణించాడు. దీంతో శుక్రవారం రెండోరోజు ఆట ముగిసేసరికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 351/5 స్కోరు చేసింది. తొలి వికెట్‌కు బ్రాత్‌వైట్‌ (48), లూయిస్‌ (21) 53 రన్స్‌ జత చేశారు. అలాగే 84/3 స్కోరు వద్ద అథనజెకు హాడ్జ్‌ కలవడంతో ఇంగ్లండ్‌ బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. ఈ ఇద్దరూ రెండో సెషన్‌లో వికెట్‌ కోల్పోకుండా ఆడి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. చివరకు 62వ ఓవర్‌లో అథనజెను స్టోక్స్‌ అవుట్‌ చేయడంతో నాలుగో వికెట్‌కు 175 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. ఇక సెంచరీ చేశాక హాడ్జ్‌ను వోక్స్‌ అవుట్‌ చేసినా.. ఆట చివర్లో కీపర్‌ జోషువా (32 బ్యాటింగ్‌), హోల్డర్‌ (23 బ్యాటింగ్‌) వికెట్‌ను కాపాడుకుంటూ రోజును ముగించారు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 416 రన్స్‌ చేసింది.

Updated Date - Jul 20 , 2024 | 05:24 AM