Share News

Paris Olympics: సెమీస్‌లో నిరాశపర్చిన లక్ష్యసేన్..

ABN , Publish Date - Aug 04 , 2024 | 04:30 PM

పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ నిరాశపర్చాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ విక్టర్ ఆక్సెల్సెన్‌‌ చేతిలో ఓడిపోయాడు.

Paris Olympics: సెమీస్‌లో నిరాశపర్చిన లక్ష్యసేన్..
Lakshya Sen

పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ నిరాశపర్చాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ విక్టర్ ఆక్సెల్సెన్‌‌ చేతిలో ఓడిపోయాడు. దీంతో కాంస్య పతకం కోసం లక్ష్యసేన్ మరో మ్యాచ్ ఆడనున్నాడు. మ్యాచ్ ప్రారంభంలో లక్ష్యసేన్ అద్భుతంగా ఆడాడు. డెన్మార్క్ ప్లేయర్‌పై ఒక దశలో అధిపత్యం కనబర్చాడు. స్కోర్ 18-13 ఉండగా.. తొలిసెట్‌ను లక్ష్యసేన్ గెలుచుకుంటాడని అంతా భావించారు. కానీ అనుహ్యాంగా డెన్మార్క్ ప్లేయర్ విక్టర్ ఆక్సెల్సెన్‌‌ చివరిలో పుంజుకుని 22-20 తేడాతో మొదటి సెట్‌ను గెలుచుకున్నాడు. ఇక రెండో సెట్‌లో లక్ష్యసేన్ తొలి పాయింట్లను గెలుచుకున్నాడు. 7-0తో ఉండగా విక్టర్ ఆక్సెల్సెన్‌‌ పుంజుకుని స్కోర్‌ను 8-8 సమం చేశాడు. ఆతర్వాత ఆఫ్ సెట్ పూర్తయ్యే సమయానికి 11-11తో స్కోర్‌ను సమం చేశాడు. చివరిగా రెండో సెట్‌ను 21-14 తేడాతో డెన్మార్క్ ఆటగాడు ఆక్సెల్సెన్ గెలుచుకుని ఫైనల్స్‌కు ప్రవేశించాడు.

Paris Olympics 2024: సెమీస్ చేరిన భారత హాకీ జట్టు.. అడుగు దూరంలో పతకం


చివరి ఛాన్స్..

లక్ష్యసేన్ పతకం సాధించడానికి ఒక అవకాశం మిగిలిఉంది. కాంస్య పతకం కోసం జరిగే మ్యాచ్‌లో గెలిస్తే బ్రాంజ్ మెడల్ రానుంది. ఇప్పటికే భారత్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో మూడు పతకాలు గెలవగా.. బ్యాడ్మింటన్‌లో మరోపతకం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీడబ్ల్యూఎఫ్ ర్యాకింగ్స్‌లో 19వ స్థానంలో ఉన్న లక్ష్యసేన్ ఫైనల్స్‌లో రెండో స్థానంలో ఆటగాడు ఆక్సెల్సెన్‌ చేతిలో ఓడిపోయాడు. వరుసగా రెండు సెట్లను చేజార్చుకుని భారత్‌కు నిరాశను మిగిల్చాడు. వాస్తవానికి ఇటీవల కాలంలో లక్ష్యసేన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గ్రూప్ లెవెల్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచిన లక్ష్యసేన్.. ప్రీక్వార్టర్స్‌కు చేరాడు. రౌండ్ 16 మ్యాచ్‌లో భారత క్రీడాకారుడు హెచ్ ఎస్ ప్రణయ్‌పై గెలిచి క్వార్టర్స్‌కు ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ చౌ టిఎన్ చెన్ మొదటి సెట్ ఓడిపోయిన లక్ష్యసేన్ తరువాత వరుసగా రెండు సెట్లలో విజయం సాధించి సెమీస్‌‌కు చేరాడు. ఆదివారం జరిగిన సెమీఫైనల్స్‌ మ్యాచ్‌లో డెన్మార్క్ ప్లేయర్ విక్టర్ ఆక్సెల్సెన్‌ చేతిలో పరాజయం చవిచూశాడు. దీంతో లక్ష్యసేన్ విజయపరంపరకు ఫుల్‌స్టాప్ పడింది.

Manu Bhakar : ఆ ఒక్క గురి హ్యాట్రిక్‌ చేజారి..

https://www.andhrajyothy.com/2024/sports/manu-bhakar-lost-the-third-medal-in-a-mistake-1292038.html


పసిడి లేనట్లే..

ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు 3 కాంస్య పతకాలు గెలిచింది. గత టోక్యో ఒలింపిక్స్‌లో ఒక బంగారు, ఒక రజత, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం ఏడు పతకాలను గెలచుకుంది. ఈసారి బంగారు పతకం వస్తుందని ఆశించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం రావడం కష్టంగానే ఉంది. కేవలం జావెలిన్ త్రోలో నీరజ్ చోఫ్రాపై మాత్రమే భారత్ పసిడి ఆశలు పెట్టుకుంది. ఇక హాకీలో కూడా భారత్ పతకం ఆశలు సజీవంగానే ఉన్నాయి. సెమిస్‌కు చేరడంతో భారత హాకీ జట్టు పతకం సాధించే అవకాశాలు ఎక్కువుగానే ఉన్నాయి.


Gymnastics : బంగారు బైల్స్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Aug 04 , 2024 | 04:31 PM