Share News

Hockey: పారిస్ ఒలింపిక్స్‌లో హాకీ పతకం వెనుక ఒడిశా ప్రభుత్వం.. మాజీ సీఎం ఎలా ప్రోత్సహించారంటే..!

ABN , Publish Date - Aug 09 , 2024 | 06:29 PM

పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు మెరిసింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్‌ను 2-1తో ఓడించింది. ఒలింపిక్ గేమ్స్‌లో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని అందుకుంది. హాకీ జట్టు సాధించిన పతకంతో దేశం మొత్తం పులకించిపోయింది. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రం పండగ చేసుకుంది. ఎందుకంటే..

Hockey: పారిస్ ఒలింపిక్స్‌లో హాకీ పతకం వెనుక ఒడిశా ప్రభుత్వం.. మాజీ సీఎం ఎలా ప్రోత్సహించారంటే..!
Indian Hockey team members

పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024)లో భారత హాకీ జట్టు మెరిసింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్‌ను 2-1తో ఓడించింది (Indian Hockey Team) ఒలింపిక్ గేమ్స్‌లో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని అందుకుంది. హాకీ జట్టు సాధించిన పతకంతో దేశం మొత్తం పులకించిపోయింది. ముఖ్యంగా ఒడిశా (Odisha) రాష్ట్రం పండగ చేసుకుంది. ఎందుకంటే భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో రాణించడం వెనుక ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ కృషి ఎంతగానో ఉంది. ముఖ్యంగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen patnaik) ప్రోత్సాహం ఎంతో ఉంది.


మన దేశ జాతీయ క్రీడ అయిన హాకీ 1980ల తర్వాత ప్రాభవం కోల్పోయింది. 2008 ఒలింపిక్స్‌కు క్వాలిఫై కూడా అవలేకపోయింది. అప్పటివరకు హాకీ జట్టుకు స్పాన్సర్‌గా ఉన్న సహారా ఇండియా 2009లో విత్ డ్రా అవడంతో కష్టాలు మరింత ముదిరాయి. దీంతో క్రీడాభిమానులు పూర్తిగా హాకీని మర్చిపోయారు. అయితే స్కూల్ డేస్‌లో హాకీ గోల్ కీపర్ అయిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాకీకి మద్దతు అందించేందుకు ముందుకు వచ్చారు. భారత మహిళల, పురుషుల హాకీ జట్లకు ఛీఫ్ స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు ఒడిశా ప్రభుత్వం ముందుకు వచ్చింది. హాకీ అభివృద్ధి కోసం ఒడిశా ప్రభుత్వం ఏకంగా రూ.120 కోట్లను కేటాయించింది.


హాకీకి ఒడిశా ప్రభుత్వం సహకారం కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు ఎన్నో రకాలుగా ఉంది. రూర్కెలాలో ఒడిశా ప్రభుత్వం ప్రపంచ స్థాయి హాకీ స్టేడియంను నిర్మించింది. 20,000 మంది కూర్చునే సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియంను నిర్మించింది. ఇప్పటివరకు అనేక అంతర్జాతీయ టోర్నీలను కూడా నిర్వహించింది. ఒడిశా సహకారంతోనే జాతీయ హాకీ జట్టు మెరుగుపడింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లో పతకాలు సాధించింది. కాగా, హాకీ ఇండియాతో ఉన్న ఒప్పందాన్ని ఒడిశా ప్రస్తుత ముఖ్యమంత్రి 2036 వరకు పొడిగించారు. తాజా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన జట్టుకు నగదు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి..

Olympics 2024: అర్షద్ నదీమ్ కూడా మన బిడ్డే..!!

హాకీకి.. పతక హారతి

మరిన్ని క్రీడా వార్తల కోసం.. క్లిక్ చేయండి.

Updated Date - Aug 09 , 2024 | 06:29 PM