Share News

Suryakumar Yadav: గంభీర్‌తో నా అనుబంధం ఇప్పటిది కాదు.. నా గురించి బాగా తెలుసు: సూర్యకుమార్ యాదవ్

ABN , Publish Date - Jul 26 , 2024 | 02:21 PM

ప్రస్తుతం టీమిండియా శ్రీలంక పర్యటనలో ఉంది. శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్‌తోనే గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. ఇక, సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టును నడిపించబోతున్నాడు. వీరిద్దరికీ ఎప్పట్నుంచో సాన్నిహిత్యం ఉంది.

Suryakumar Yadav: గంభీర్‌తో నా అనుబంధం ఇప్పటిది కాదు.. నా గురించి బాగా తెలుసు: సూర్యకుమార్ యాదవ్
Surya kumar Yadav

ప్రస్తుతం టీమిండియా (TeamIndia) శ్రీలంక (Sri Lanka) పర్యటనలో ఉంది. శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్‌తోనే గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) టీమిండియా హెడ్ కోచ్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. ఇక, సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) టీ20 జట్టును నడిపించబోతున్నాడు. వీరిద్దరికీ ఎప్పట్నుంచో సాన్నిహిత్యం ఉంది. గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆ జట్టులో సూర్యకుమార్ యాదవ్ సభ్యుడిగా ఉన్నాడు. గంభీర్ ప్రోత్సాహంతోనే సూర్యకు మెరుగైన అవకాశాలు వచ్చాయి. గంభీర్‌తో తను అనుబంధం గురించి తాజాగా సూర్య మాట్లాడాడు.


``గంభీర్‌తో నా అనుబంధం ప్రత్యేకమైనది. గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నేను ఆ జట్టులో ఆడాను. గంభీర్ ప్రోత్సాహంతోనే నాకు మెరుగైన అవకాశాలు వచ్చాయి. మా మధ్య ఆ బంధం ఇప్పటికీ బలంగా ఉంది. మా ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి అవగాహన ఉంది. నా ఆటతీరు ఏంటో, ప్రాక్టీస్ సెషన్‌లో ఎలా ఉంటానో గంభీర్‌కు క్షుణ్నంగా తెలుసు. గంభీర్ ఆలోచనల గురించి నాకు అవగాహన ఉంది. మా కాంబినేషన్‌లో టీమిండియాకు మెరుగైన ఫలితాలు అందించేందుకు కృష్టి చేస్తామ``ని సూర్యకుమార్ అన్నాడు.


ఐపీఎల్, టీమిండియా తరఫున ఆడేటపుడు పలువురు కెప్టెన్లను దగ్గర్నుంచి చూశానని, వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని సూర్య అన్నాడు. తనకు లభించిన గొప్ప బాధ్యతను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. కాగా, జులై 27, 28, 30 తేదీల్లో శ్రీలంకతో టీమిండియా మూడు టీ20 మ్యాచ్‌లు ఆడబోతోంది.

ఇవి కూడా చదవండి..

Champions Trophy: కోహ్లీ పేరుతో బీసీసీఐకి బ్లాక్‌మెయిల్.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఏమన్నాడంటే..


Jasprit Bumrah: రోహిత్ శర్మ-పాండ్యా కెప్టెన్సీ వివాదంపై తొలిసారి స్పందించిన జస్ప్రీత్ బుమ్రా

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 26 , 2024 | 02:21 PM