Record: ఒక కుటుంబం.. 20 గిన్నిస్ రికార్డులు
ABN , Publish Date - Oct 06 , 2024 | 11:29 AM
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ బీటెక్ పూర్వ విద్యార్థిని (2016-20) శివాలి జోహ్రి శ్రీవాస్తవ, ఆమె తల్లి కవిత జోహ్రి శ్రీవాస్తవ, తండ్రి అనిల్ శ్రీవాస్తవలు మూడు (18, 19, 20వ) గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించి కుటుంబసభ్యులతో శివాలి జోహ్రి శ్రీవాస్తవ చరిత్ర సృష్టించారు.
పటాన్చెరు రూరల్: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ బీటెక్ పూర్వ విద్యార్థిని (2016-20) శివాలి జోహ్రి శ్రీవాస్తవ, ఆమె తల్లి కవిత జోహ్రి శ్రీవాస్తవ, తండ్రి అనిల్ శ్రీవాస్తవలు మూడు (18, 19, 20వ) గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించి కుటుంబసభ్యులతో శివాలి జోహ్రి శ్రీవాస్తవ చరిత్ర సృష్టించారు. 3,100 ఒరిగామి నెమళ్లు, 1,100 ఒరిగామి చొక్కాలు, 3,200 ఒరిగామి పందుల బొమ్మలను ఒకేచోట ఉంచిన ఈ కుటుంబం అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పినట్టు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇంతకు ముందు శివాలి కుటుంబం చేతితో తయారుచేసిన కాగితపు బొమ్మలు, క్విల్డ్ పువ్వులు, ఒరిగామి వేల్స్ పెంగ్విన్లు, సిట్రస్ పండ్లు, మాపుల్ ఆకులు, కుక్కలు, రాక్షస బల్లులు.. మరికొన్నింటితో సహా వివిధ ప్రదర్శనలతో 17 గిన్నిస్ ప్రపంచ రికార్డులను పొందింది.
ఇవేకాక 15 అసిస్ట్ వరల్డ్ రికార్డ్, పది యూనిక్ వరల్డ్ రికార్డులను శివాలి కుటుంబం కలిగి ఉందని వివరించారు. మొత్తం 20 గిన్నిస్ రికార్డులను సాధించిన శివాలి, ఆమె తల్లిదండ్రులను గీతం హైదరాబాద్ అదనపు ఉపకుల పతి ప్రొఫెసర్ డీఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.ఆర్.శాస్త్రి, అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య, గణిత విభాగం అధ్యాపకుడు డాక్టర్ మల్లికార్జున్, వివిధ విభాగాధిపతులు అభినందించారు.
Today Horoscope : ఈ రాశి వారికి ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి.
కుర్రాళ్లకు సువర్ణావకాశం
For Latest News and Business News click here