Share News

MLC Kavitha: కవితకు బెయిల్ వస్తుందా.. కాసేపట్లో తీర్పు..

ABN , Publish Date - Jul 01 , 2024 | 09:26 AM

మూడు నెలలుగా తీహార్ జైలులో ఉన్న కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని సీబీఐ , ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుతం కవిత అరెస్ట్ అయ్యారు.

MLC Kavitha: కవితకు బెయిల్ వస్తుందా.. కాసేపట్లో తీర్పు..
MLC Kavitha

మూడు నెలలుగా తీహార్ జైలులో ఉన్న కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) తీర్పు వెలువరించనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని సీబీఐ (CBI) , ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుతం కవిత అరెస్ట్ అయ్యారు. కవిత బెయిల్ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు కొట్టివేయడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత తరపున న్యాయవాదుల వాదనలతో పాటు ఈడీ, సీబీఐ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును జులై1కి రిజర్వు చేసింది. జస్టిస్ స్వర్ణకాంతశర్మ సోమవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు న్యాయమూర్తి తీర్పు ప్రకటించనున్నారు. సీబీఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీ లాండరింగ్‌ కేసులో కవిత బెయిల్‌ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె సవాల్‌ చేశారు. ఈ కేసులోని 50మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళని.. దీన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ వాదనను సీబీఐ, ఈడీ వ్యతిరేకించాయి. ఈక్రమంలో కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

Yadagirigutta: వీఐపీకి గంట, ధర్మదర్శనానికి 3 గంటలు..


బెయిల్ వస్తుందా..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో వరుస ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. సీబీఐ, ఈడీ ఈకేసుకు సంబంధించి ఎంతోమంది ప్రముఖులను అరెస్ట్ చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇదే కేసులో తీహార్ జైలులో ఉన్నారు. కవిత బెయిల్ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసినా హైకోర్టు మాత్రం ఆ బెయిల్‌పై స్టే ఇచ్చింది. దీంతో ఈకేసులో ఊహించిందొకటి.. జరిగేదొకటిగా ఉంది. కేజ్రీవాల్ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంతో పాటు.. ఈకేసులో కవిత కీలక సూత్రధారిగా ఉన్నారని ఈడీ, సీబీఐ వాదిస్తుండటంతో బెయిల్ రావడం కష్టమనే చర్చ నడుస్తోంది. కవితకు బెయిల్ వస్తుందా.. లేదా అనేది కొన్ని గంటల్లో తేలనుంది.

Hyderabad: ఇన్‌చార్జ్‌ల పాలనలో ఆర్‌ అండ్‌ బీ..


సుప్రీంకు వెళ్లే ఆలోచన..

ఢిల్లీ హైకోర్టులో కవితకు ఉపశమనం దక్కకపోతే ఆమె తరపు న్యాయమవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం తీర్పు ఆధారంగా ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనేదానిపై కవిత న్యాయవాదుల బృందం ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కనీసం రెగ్యులర్ బెయిల్ ఇవ్వకపోయినా.. కండీషన్స్ బెయిల్ కోసం ప్రయత్నం చేయాలని కవిత తరపున న్యాయవాదులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


బొగ్గు నిక్షేపాలను ప్రైవేట్‌పరం చేస్తే సహించం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Jul 01 , 2024 | 09:26 AM