Share News

TS News: రాంచీ ఎక్స్‌ప్రెస్ వేస్ లిమిటెడ్-మధుకాన్ ప్రాజెక్ట్ కేసులో ఈడీ ఛార్జిషీటు దాఖలు

ABN , Publish Date - Sep 03 , 2024 | 04:44 PM

రాంచీ ఎక్స్‌ప్రెస్ వేస్ లిమిటెడ్ మధుకాన్ ప్రాజెక్టు కేసులో ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. పీఎంఎల్ఏ యాక్ట్ 2002 ప్రకారం ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌ వేస్ లిమిటెడ్, దాని డైరెక్టర్లపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

TS News: రాంచీ ఎక్స్‌ప్రెస్ వేస్ లిమిటెడ్-మధుకాన్ ప్రాజెక్ట్ కేసులో ఈడీ ఛార్జిషీటు దాఖలు

హైదరాబాద్: రాంచీ ఎక్స్‌ప్రెస్ వేస్ లిమిటెడ్ మధుకాన్ ప్రాజెక్టు కేసులో ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. పీఎంఎల్ఏ యాక్ట్ 2002 ప్రకారం ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌ వేస్ లిమిటెడ్, దాని డైరెక్టర్లపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. రాచీ-రార్‌గావ్-జమ్‌షెడ్‌పూర్ సెక్షన్‌లో ఎన్‌హెచ్-33కి సంబంధించిన 4-లేనింగ్ ప్రాజెక్ట్‌పై మధుకాన్ కంపెనీ బ్యాంక్ నుంచి రుణం తీసుకుంది. పూర్తి రుణ మొత్తాన్ని పొందినప్పటికీ ప్రాజెక్ట్‌ను మాత్రం మధుకాన్ గ్రూప్ పూర్తి చేయలేకపోయిందని ఎఫ్ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. కాగా కంపెనీ కాంట్రాక్ట్ రద్దైంది. ఇక జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల ఆధారంగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.


కాగా కెనరా బ్యాంక్ నుంచి మధుకాన్ కంపెనీ రూ.1030 కోట్లు రుణం తీసుకుంది. మధుకాన్ గ్రూప్ తీసుకున్న రుణాలను ఇతర కంపెనీలకు తరలించారని ఈడీ పేర్కొంది. ఇతర పనులలో ఉపయోగించడం కోసం దాని అనుబంధ సంస్థలకు మళ్లించారని పేర్కొంది. షెల్ కంపెణీలకు నగదు బదిలీ చేసి మోసానికి పాల్పడ్డారని ఈడీ వివరించింది.


పరిగణనలోకి తీసుకున్న కోర్ట్..

మనీ లాండరింగ్ కేసులో మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుకు సంబంధించిన కంపెనీ మధుకాన్ ప్రాజెక్ట్స్‌పై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. రాంచీ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్, మధుకాన్ ప్రాజెక్ట్స్‌పై గతంలో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. రాంచీ-జంషెడ్‌పూర్ మధ్య 4వ లైన్ హైవే నిర్మాణానికి రూ.1030 కోట్లు కంపెనీ రుణం తీసుకుంది. తీసుకున్న రుణాన్ని ఇతర సెల్ కంపెనీలకు మళ్లించింది. రూ.365.78 కోట్ల మొత్తాన్ని మళ్లించినట్లు గుర్తించామని మనీల్యాండరింగ్ కేసులో ఈడీ పేర్కొంది. గతంలో మధుకాన్ కంపెనీలపై ఈడీ సోదాలు నిర్వహించింది. రూ.34 లక్షల నగదుతో పాటు 105 ప్రొపర్టీలను అటాచ్ చేసింది. మధుకాన్ కంపెనీకి చెందిన రూ.96.21 కోట్లను ఈడీ జప్తు చేసింది.

Updated Date - Sep 03 , 2024 | 04:45 PM