Share News

Hydra-Nagababu: ఇప్పటికైనా అర్థమైందా?.. సంచలనం సృష్టిస్తున్న హైడ్రాపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 01 , 2024 | 06:28 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా ఎంతలా సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. రాజకీయ నాయకుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ఎవరికి సంబంధించిన అక్రమ నిర్మాణాలనైనా వదలడం లేదు.

Hydra-Nagababu: ఇప్పటికైనా అర్థమైందా?.. సంచలనం సృష్టిస్తున్న హైడ్రాపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా ఎంతలా సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. రాజకీయ నాయకుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ఎవరికి సంబంధించిన అక్రమ నిర్మాణాలనైనా వదలడం లేదు. ఈ అక్రమ కట్టడాల కూల్చివేతలపై జనాల నుంచి సానుకూల స్పందన వస్తోంది. అయితే విపక్ష నాయకులను దెబ్బతీసేందుకేనంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న విషయం విధితమే.


అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో జనసేన కీలక నేత, ఏపీ డిప్యూటీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు అయిన నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్ ఇప్పటికైనా అర్థమైందా అంటూ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రిని అభినందిద్దాం అంటూ ఆయన పేర్కొన్నారు. ‘‘రేవంత్ రెడ్డిగారూ మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీకు సంపూర్ణ మద్దతుగా మేము నిలబడతాం’’ అని నాగబాబు పేర్కొన్నారు. ‘‘పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే కచ్చితంగా అది శిక్షిస్తుంది‌’’ అంటూ ఆయన పేర్కొన్నారు.


వర్షాలు పడి తూములు తెగిపోయి, చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి అపార్ట్‌మెంట్లలోకి కూడా నీళ్లు వస్తున్నాయని, కొందరు సామాన్యులు బలికావడం చాలా బాధాకరమని నాగబాబు ప్రస్తావించారు. వీటికి ముఖ్య కారణం చెరువుల్ని, నాళాలను అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడమేనని పేర్కొన్నారు.


భద్రంగా ఉండండి..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భద్రంగా ఉండాలంటూ నాగబాబు సూచించారు. ‘‘భారీ వర్షాలు, వరదల బారిన పడ్డ లోతట్టు ప్రాంతాల వారందరూ అప్రమత్తంగా ఉండండి. ముంపు ప్రాంతాలన్నింటికీ ప్రభుత్వం (ఏపీ) సహాయ సాకారాలు చేబట్టింది. అత్యవసర సమయాల్లో తప్ప, ప్రజలు‌ వరద ప్రభావం తగ్గుముఖం పట్టే వరకు బయటకి రాకండి. స్టే సేఫ్’’ అని నాగబాబు వ్యాఖ్యానించారు.

Updated Date - Sep 01 , 2024 | 08:34 PM