Share News

Medchal-Malkajgiri: ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:53 AM

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ ఖాజిగూడలోని ప్రభుత్వ స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను భారీ బందోబస్తు మద్య అధికారులు సోమవారం తొలగించారు.

Medchal-Malkajgiri: ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

  • అధికారులను ఆక్రమణదారులు అడ్డుకునే యత్నం

  • పోలీసుల బందోబస్తు మధ్య కొన్ని నేలమట్టం

మేడ్చల్‌ టౌన్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ ఖాజిగూడలోని ప్రభుత్వ స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను భారీ బందోబస్తు మద్య అధికారులు సోమవారం తొలగించారు. రూ.50 కోట్ల ప్రభుత్వ స్థలానికి ఎసరు అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై స్పందించిన ఉన్నత అధికారులు స్థానిక రెవెన్యూ సిబ్బందిని కట్టడాలు తొలగించటానికి గుండ్లపోచంపల్లి పంపారు. కాగా నిర్మాణాలు తొలగించటానికి వచ్చిన రెవెన్యూ సిబ్బందిని అక్రమ నిర్మాణదారులు అడ్డుకొని గొడవ పెట్టడటంతో స్థానిక తహసీల్దార్‌ శైలజ పేట్‌బషీరాబాద్‌ పోలీసలతో ప్రొటక్షన్‌ తీసుకున్నారు.


అయినప్పటికీ అక్రమార్కులు నిర్మాణాలను తొలగించకుండా అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమను నిరాశ్రయులు చేయరాదంటూ అధికారులతో ప్రాధేయ పడ్డారు. చివరికి పోలీసులు అడ్డు వచ్చిన వారిని పక్కన జరిపి నిర్మాణాలను తొలగించారు. కాగా ఎవరు అడ్డువచ్చినా కూల్చివేతలు ఆపే ప్రసక్తి లేదని తహసీల్దార్‌ శైలజ స్పష్టం చేశారు. సర్వే నంబర్‌ 30లోని 4 ఎకరాల 23 గుంటల స్థలం పూర్తి స్థాయిలో స్వాదీనం చేసుకుంటున్నామని తె లిపారు.

Updated Date - Nov 19 , 2024 | 01:53 AM