కాంచీపుర నాయకి కామాక్షీదేవి కటాక్షశ్రీలే పురాణపండ శ్రీనివాస్ ‘జయం జయం’ - ‘శ్రీమాలిక’
ABN , Publish Date - May 03 , 2024 | 11:03 PM
కొన్ని అనుభూతులు అనిర్వచనీయ అనుభూతులుగా కమ్ముకున్నప్పుడు.. జీవితకాలమంతటా ఆ పవిత్ర జ్ఞాపకాలు వెన్నంటి వుంటాయనడానికి ఇలాంటి అద్భుతాల్ని అప్పుడప్పుడు మనస్సు ముందు నివేదించుకోవాలంటారు ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ మాసపత్రిక పూర్వ గౌరవ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్.
కొన్ని అనుభూతులు అనిర్వచనీయ అనుభూతులుగా కమ్ముకున్నప్పుడు.. జీవితకాలమంతటా ఆ పవిత్ర జ్ఞాపకాలు వెన్నంటి వుంటాయనడానికి ఇలాంటి అద్భుతాల్ని అప్పుడప్పుడు మనస్సు ముందు నివేదించుకోవాలంటారు ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ పూర్వ గౌరవ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్. ఇటీవల తిరుపతిలో జరిగిన ఒక వైదిక సదస్సులో పురాణపండ ఈ అపురూప ఘట్టాల్ని పండిత బృందాలమధ్య మరొకసారి ఆవిష్కరించి సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన కొందరు వేదపండితుల, అర్చక బృందాలు పేర్కొనడం గమనార్హం.
సుమారు దశాబ్దంన్నర క్రితం తాను మొదలు పెట్టిన ‘జయం జయం’ ప్రత్యేక గ్రంధం లక్షల ప్రతుల ఉచిత వితరణోద్యమాన్ని నాటి కంచికామకోటి పీఠాధిపతులు, వేద వేదాంగ పారంగతులు శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీ మహాస్వామి మంగళాశాసనం చేసి కటాక్షశ్రీలు వర్షించగా... రెండేళ్లనాడు శ్రీకారం చుట్టిన ‘శ్రీమాలిక’ మంత్రపుష్ప గ్రంధంపై నేటి కంచి కామకోటి పీఠాధిపతులు, పరమ శివావతారమూర్తులు, అపర శంకరులుగా ప్రసన్న తేజస్సుతో శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామి కారుణ్యం వర్షించడం కేవలం శివానుగ్రహమేనని పురాణపండ శ్రీనివాస్ విశ్లేషణలతో చెప్పడం అక్కడ అందరినీ ఆశ్చర్యపరచడమే కాకున్నా కొందరిని ఉద్విగ్నపరించిందని పండిత సమూహాలు పేర్కొంటున్నాయి.
అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వందల పట్టణాల, వందల గ్రామాలలో ఆలయాల్ని ‘జయం జయం’ ఉర్రూతలూగించినట్లు ఈనాటికీ గోదావరి జిల్లాల అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయం మొదలు కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానం వరకూ గల ఆలయాల ధర్మకర్తలు, ప్రధాన అర్చకుల వరకూ చెప్పుకోవడం విశేషమే మరి. ఇక రెండవదైన పురాణపండ శ్రీనివాస్ ‘శ్రీమాలిక’ గ్రంధాన్ని మొదలు పెట్టింది మాజీ మంత్రి, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య కాగా... తరువాయి క్రమంలో వరుసగా వారాహి చలన చిత్రం అధినేతలు సాయి కొర్రపాటి, రజని కొర్రపాటి దంపతులు.. భారతదేశ కేంద్ర పర్యాటక శాఖామంత్రి జి. కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక శాఖామంత్రి ఆర్కే రోజా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలు విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల తదితర ప్రముఖులు వేల వేల ప్రతులు ముద్రించి తెలుగు రాష్ట్రాల ఎల్లలు దాటించడం.. దేశ దేశాల తెలుగు గడపలకు డెబ్బై శాతంగా అందడం ప్రత్యేక విశేషంగానే చెప్పక తప్పదు.
ఈ పుస్తకాలు రెండింటినీ భక్త పాఠకులు ఇలా సుదీర్ఘకాలంగా అక్కున చేర్చుకోవడానికి పురాణపండ శ్రీనివాస్ సమర్ధ సృజనాత్మక ప్రతిభా సామర్ధ్యం, పూర్తిగా స్వచ్ఛమైన నిస్వార్ధ సేవ అని అంతా చెప్పుకుంటున్నారు. ‘జయం జయం’ మరియు ‘శ్రీమాలిక’ గ్రంథ పరిమళాలు అల్లాంటివి మరి!
ఏదేమైనా ఈరోజుల్లో కూడా సమృద్ధిగా పురాణపండ చేస్తున్న మంత్రభరితమైన, కథా కథన వ్యాఖ్యాన వైఖరీ దక్షతల అపురూప ధార్మిక రచనల, ప్రచురణల పేటికలు పురాణపండ శ్రీనివాస్ ఉపాసనాబలాన్ని, కావ్యత్వం లాంటి పవిత్రతనూ చరిత్రకెక్కిస్తాయనడం నిర్వివాదాశంగానే విజ్ఞులు, రసజ్ఞులు నొక్కి చెబుతున్నారు.
కాంచీపుర నాయకి కంచికామాక్షీదేవి కారుణ్యామృతమే జయేంద్ర, విజయేంద్రుల రూపంలో పురాణపండ శ్రీనివాస్‌పై వర్షించిందేమో! అందుకే కాబోలు.. ఇటీవల చెన్నై తెలుగువారు దాదాపుగా పురాణపండ శ్రీనివాస్ శ్రీమాలికనే ధరించి బృందాలు బృందాలుగా పారాయణలకు వెళ్లడం స్పష్టంగా దర్శనమిస్తోంది.