Share News

సాధకునిగా, కార్య సాధకునిగా మార్చేది స్తోత్ర సాహిత్యమే: పురాణపండ గ్రంథావిష్కరణలో రమణాచారి

ABN , Publish Date - Jul 19 , 2024 | 11:27 PM

ప్రపంచం నుండి పరమాత్మవైపుకు మనస్సును మరల్చడమే దైవీయ చైతన్య గ్రంధాల లక్షణమని, మనిషిని సాధకునిగా, కార్య సాధకునిగా మార్చేది కేవలం స్తోత్ర మంత్ర సాహిత్యం మాత్రమేనని సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణా ప్రభుత్వ పూర్వ అధికారి కెవి రమణాచారి పేర్కొన్నారు. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనం శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్ గ్రంధాన్ని శుక్రవారం రాత్రి హైదరాబాద్ త్యాగరాయగానసభలో ఆయన ఆవిష్కరించారు.

సాధకునిగా, కార్య సాధకునిగా మార్చేది స్తోత్ర సాహిత్యమే: పురాణపండ గ్రంథావిష్కరణలో రమణాచారి

హైదరాబాద్, జూలై 19: ప్రపంచం నుండి పరమాత్మవైపుకు మనస్సును మరల్చడమే దైవీయ చైతన్య గ్రంధాల లక్షణమని, మనిషిని సాధకునిగా, కార్య సాధకునిగా మార్చేది కేవలం స్తోత్ర మంత్ర సాహిత్యం మాత్రమేనని సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణా ప్రభుత్వ పూర్వ అధికారి కె వి రమణాచారి పేర్కొన్నారు.

ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనం శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్ గ్రంధాన్ని శుక్రవారం రాత్రి హైదరాబాద్ త్యాగరాయగానసభలో ఆయన ఆవిష్కరించారు.

Lalitha-Vishnu-KVR.jpg

ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ, ఆర్షభారతి సేవలో రెండు దశాబ్దాలుగా తరిస్తున్న పురాణపండ శ్రీనివాస్ జీవన యాత్రలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని, ఋషుల ఆశీర్బలమే ఆధారంగా పరమాద్భుతాలు అందిస్తున్నారని, శ్రీనివాస్‌కు వేద శాస్త్రాల పట్ల వుండే పూజ్యభావమే ఇన్ని లక్షలమందికి గ్రంథ నిధులను అందింపచేస్తోందని, ఇది ఆషామాషీ వ్యవహారం కాదని ప్రశంసించారు.

మూడు వందల పై చిలుకు పేజీలతో తేజరిల్లుతున్న శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్‌లోని అపూర్వ అంశాలను ఏ సమయంలో స్మరణ చేసినా, పఠనం చేసినా ధన్యులమౌతామని, మనస్సు కుదుర్చుకున్న సరైన భక్తితో స్తోత్రశక్తిని ఆశ్రయిస్తే అన్నిరకాల ఆపదలనూ క్షణకాలంలో తొలగిస్థాయని, అలాంటి పవిత్రఅంశాల్నీ పురాణపండ శ్రీనివాస్ కేవలం సంకలనంగానే కాకుండా అద్భుతమైన వ్యాఖ్యానాలను అందించడం భక్త పాఠకుల్ని విశేషంగా ఆకర్షిస్తుందని రమణాచారి అభినందించారు.

Kv-ramanachary.jpg

ప్రఖ్యాత ధార్మిక ప్రచురణల సంస్థ ‘జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం’ ప్రచురించిన ఈ శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్ ఐదవ పునర్ముద్రణకు త్యాగరాయగానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి సమర్పకులుగా వ్యవహరించడం విశేషం.

Puranpanda.jpg

జంట నగరాలలోని అర్చకులకు, వేదపండితులు, వేదపాఠశాలలకు, సాంస్కృతిక సాహిత్య సంస్థలకు ఈ పవిత్ర శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్ గ్రంధాన్ని ఉచితంగా అందించనున్నట్లు జనార్ధనమూర్తి తెలిపారు.

Updated Date - Jul 19 , 2024 | 11:39 PM