Share News

MLA RajaSingh: హత్యకు రెక్కీ.. స్పందించిన రాజా సింగ్

ABN , Publish Date - Sep 29 , 2024 | 02:40 PM

తన నివాసం వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై గోషా మహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆదివారం హైదరాబాద్‌లో స్పందించారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని నగర పోలీస్ ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. అయినా ఇటువంటి వాటికి తాను భయపడనని రాజా సింగ్ స్పష్టం చేశారు.

MLA RajaSingh: హత్యకు రెక్కీ.. స్పందించిన రాజా సింగ్
MLA RajaSingh

హైదరాబాద్, సెప్టెంబర్ 29: తన నివాసం వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై గోషా మహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆదివారం హైదరాబాద్‌లో స్పందించారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని నగర పోలీస్ ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. అయినా ఇటువంటి వాటికి తాను భయపడనని రాజా సింగ్ స్పష్టం చేశారు. తన మీద రెక్కీ నిర్వహించడం కోసం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్నారు.

Also Read:Tirumala: కోనేటి రాయుడి సేవలో ఒకరోజు.. టికెట్ ఎంతంటే..


ఈ విషయాన్ని గమనించి.. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. దీంతో వారిద్దరిని మంగళహాట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. తన నివాసం వద్ద రెక్కీ నిర్వహించి.. ముంబయిలో కొంతమందికి సమాచారం చేర వేస్తున్నారని ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ సందర్బంగా ఆరోపించారు.

Also Read: Ponnam: ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ

Also Read: Nepal: నేపాల్‌ను మంచెత్తిన వరదలు: 112 మంది మృతి


మరోవైపు రెక్కి నిర్వహించిన ఇద్దరు వ్యక్తులు ఇస్మాయిల్, మహ్మద్ ఖాజాగా పోలీసులు గుర్తించారు. అలాగే వారి సెల్ ఫోన్లలో రాజా సింగ్ ఫొటోతోపాటు తుపాకీలు, బులెట్ల ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు విచారిస్తున్నారు. రాజా సింగ్‌ నివాసం వద్ద రెక్కీ నిర్వహించారంటూ వార్తలు రావడంతో హైదరాబాద్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది.

Also Read: Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..

Also Read: Web Story: గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలి పెట్టరు


తెలంగాణ బీజేపీకి చాలా మంది నేతలున్నారు. కానీ ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేత రాజా సింగ్. హిందుత్వం గురించి ఆయన తనదైన శైలిలో బలమైన గళం వినిపిస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. నగరంలోని గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పలుమార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. అయితే గతంలో ముహమ్మద్‌పై ఆయన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజా సింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఏడాది అనంతరం ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఆ పార్టీ ఎత్తివేసింది. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై 105 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
Also Read: Gujarat: రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Also Read: ముందుగా టికెట్ బుక్ చేయకున్నా.. తిరుమల వెంకన్నను ఇలా ఈజీగా దర్శించుకోవచ్చు.. ఎలాగంటే..?


మరోవైపు రాజాసింగ్ హత్యకు గతంలో జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని సూరత్ నగరంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. పాకిస్థాన్, నేపాల్‌లోని కొందరు వ్యక్తుల ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రాజా సింగ్ హత్యకు కుట్ర పన్నినట్లు ఈ విచారణలో వెల్లడించాడు. రాజాసింగ్ హత్యకు రూ. కోటి సుపారీ కుదిరిందని పోలీసుల దర్యాప్తులో సదరు వ్యక్తి స్పష్టం చేసినట్లు సమాచారం. ఇంకోవైపు తాజాగా రాజాసింగ్ లక్ష్యంగా ఇద్దరు వ్యక్తులు రెక్కి నిర్వహించడం పట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతుంది.

Read Latest Telangana News and National News

Updated Date - Sep 29 , 2024 | 03:04 PM