కొత్త అల్లుడికి 66 వంటకాలతో భోజనం!
ABN , Publish Date - Oct 14 , 2024 | 04:29 AM
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామానికి చెందిన వంశీకి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం ధర్మారావుపేటకు చెందిన శ్వేతతో ఆగస్టు 28న పెళ్లి జరిగింది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామానికి చెందిన వంశీకి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం ధర్మారావుపేటకు చెందిన శ్వేతతో ఆగస్టు 28న పెళ్లి జరిగింది. ఆచార సంప్రదాయాల ప్రకారం వివాహమయ్యాక వచ్చే తొలి దసరా, ఉగాది పండగలను చేదు పండుగలుగా భావించి, అత్తింటివారు కొత్త అల్లుడిని ఇంటికి తీసుకరారు. మహబూబాబాద్ జిలా బయ్యారంలో ఉంటు న్న శ్వేత పిన్ని, బాబాయి గరిపెల్లి లావణ్య- వేణు కుటుంబం కొత్త దంపతులను దసరాకు ఆహ్వానించారు. ఏకంగా 66 రకాల వంటకాలతో విందు భోజ నం ఏర్పాటు చేశారు. వేణు కుటుంబం స్వరాష్ట్రంలో ఇలా నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టి కొత్త అల్లుడికి విందు భోజనం ఏర్పాటు చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- బయ్యారం (మహబూబాబాద్ జిల్లా)