Share News

యోగ నారసింహుని అనుగ్రహమే పురాణపండ ‘ఉగ్రం వీరం’.. పొన్నాల లక్ష్మయ్య పూర్వ జన్మ సుకృతమే!

ABN , Publish Date - May 29 , 2024 | 11:58 PM

యుగాల వెనుక... కాలాల వెనుక దైవ బలమేంటో పదునాలుగు లోకాలకీ సాక్షాత్కరింప చేసిన వీర నృసింహ అవతార వైభవాన్ని అక్షరరూపంలో ‘ఉగ్రం ... వీరం’గా వేలాది మందికి అందించడానికే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌తో ఈ అపురూప గ్రంధాన్ని ఇలా కథాకథన వ్యాఖ్యాన వైఖరీ దక్షతతో కూడిన ప్రహ్లాద నారసింహుల రసవత్తర ఘట్టంగా గ్రంథ రూపంలో అందించే భాగ్యం తనకు కలిగిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ఐ.టి. శాఖామంత్రి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.

యోగ నారసింహుని అనుగ్రహమే పురాణపండ ‘ఉగ్రం వీరం’.. పొన్నాల లక్ష్మయ్య పూర్వ జన్మ సుకృతమే!

హైదరాబాద్, మే 29: యుగాల వెనుక... కాలాల వెనుక దైవ బలమేంటో పదునాలుగు లోకాలకీ సాక్షాత్కరింప చేసిన వీర నృసింహ అవతార వైభవాన్ని అక్షరరూపంలో ‘ఉగ్రం ... వీరం’గా వేలాది మందికి అందించడానికే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌తో ఈ అపురూప గ్రంధాన్ని ఇలా కథాకథన వ్యాఖ్యాన వైఖరీ దక్షతతో కూడిన ప్రహ్లాద నారసింహుల రసవత్తర ఘట్టంగా గ్రంథ రూపంలో అందించే భాగ్యం తనకు కలిగిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ఐ.టి. శాఖామంత్రి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.

SVBC.jpg

అనేక పుణ్య క్షేత్రాలనుండి, ధార్మిక మండళ్ల నుండి వస్తున్న స్పందనకు పొన్నాల స్పందిస్తూ.. ఇది రాజకీయాలకు అతీతమైన అద్భుత పవిత్ర సేవ అని, యాదాద్రి లక్ష్మీ నృసింహుని సమక్షంలోనే కాకుండా బెజవాడ ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మ సన్నిధిలో మహాత్ములైన చాగంటి కోటేశ్వరరావు వంటి మహా ప్రవచన కర్తతో ఈ అపురూపం ఆవిష్కరించబడటం, త్యాగరాయ గానసభ కళా వేదికపై రసజ్ఞుల సమక్షంలో ప్రశంసలు పొందటం.. పురాణపండ శ్రీనివాస్ అద్భుత కృషికి, తన సౌజన్యానికి కేవలం భగవత్కటాక్షంగా వివరించారు.

Puranapanda-and-Ponnala.jpg

ఈ సందర్భంగా యాదాద్రి, కదిరి, వేదాద్రి, సింహాచలం, తిరుమల, ధర్మపురి, మంగళగిరి, అంతర్వేది, చేర్యాల, బీదర్, కోరుకొండ, ఆగిరిపల్లి, ఫణిగిరి... ఇలా అనేక మహా నారసింహ క్షేత్రాల వేద పండితుల నుండీ, అర్చకుల నుండీ అందుతున్న ఆశీర్వచనాలకు పొన్నాల లక్ష్మయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Ugram-Veeram.jpg

ఈ పవిత్ర మహా కార్యానికి ఒక యజ్ఞభావనతో అద్భుత రచనాసమర్థతను, మరువలేని నిస్వార్ధ సేవను ఎంతో సంతోషంతో అందించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కృషి అసాధారణమని పొన్నాల ఆర్ద్రంగా చెప్పారు.

Ugram-Veeram-2.jpg

తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ఉన్నతోద్యోగి వేంకట సుబ్రహ్మణ్యం, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఉన్నతోద్యోగి వేంకటరావు తదితర ప్రముఖులు తిరుమల తిరుపతిలలో వివిధ విభాగాలకు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లోను బుధవారం ఈ ఉగ్రం ... వీరం పరమ పవిత్ర గ్రంధాన్ని అందించడంతో.. పొన్నాల చేసిన ఈ అక్షర యజ్ఞ క్రతువును సామూహికంగా ప్రశంసించడం గమనార్హం.

Pandits.jpg

తిరుమలలో అర్చక భవన్ లగాయతు వేద పాఠశాల వరకూ... ఇంచుమించుగా ఉన్న అన్ని విభాగాలలోని ఉద్యోగ బృందాల వద్ద దశాబ్దంగా పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుత గ్రంధాలున్నాయని, శ్రీనివాస్ పుస్తకాలంటే తమకు ఎంతో అభిమానమని.. పదేళ్లనాడు పొన్నాల వారు అందించిన ‘శత్రు భయంకరం’ అనే నృసింహ శక్తిమంత గ్రంధం ఈనాటికీ ఎందరో పారాయణం చేస్తూంటారని... మళ్ళీ ఇన్నాళ్లకు తిరుమల మహాక్షేత్ర యోగ నారసింహుని కటాక్షంగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనా సౌందర్యం ఇలా ‘ఉగ్రం .. వీరం’గా ఇంత అందంగా, ఎంతెంతో అందంగా కమనీయంగా తిరుమల వైఖానస బృందాలకు వందల సంఖ్యలో అందడం వెనుక మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నిస్వార్థమైన పరమార్ధ కృషి ఉండటం ఆయన అంకితభావాన్ని తెలియజేస్తోందని తిరుచానూరు అలమేల్మంగమ్మ ఆలయ వేదపండితుడొకరు బాహాటంగా వ్యాఖ్యానించడం పూర్వజన్మ సుకృతంగా భావించాల్సిందే.

Ugram-Veeram.jpg

Updated Date - May 30 , 2024 | 07:55 AM