Share News

TG Assembly: అసెంబ్లీ కమిటీలకు చైర్మన్లను నియామకం.. ఎవరెవరంటే

ABN , Publish Date - Sep 09 , 2024 | 06:30 PM

శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) సోమవారం ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్‌గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

TG Assembly: అసెంబ్లీ కమిటీలకు చైర్మన్లను నియామకం.. ఎవరెవరంటే

హైదరాబాద్: శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) సోమవారం ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్‌గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా షాద్ నగర్ ఎమ్మెల్యే కే శంకరయ్యని నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణ శాసనసభ(Telangana Assembly) మొత్తంగా 3 ఆర్థిక కమిటీలను ఏర్పాటు చేసిందనమాట. అన్ని కమిటీల్లోనూ మొత్తం 12 మంది చొప్పున సభ్యులు ఉండనున్నారు.


మండిపడిన హరీశ్ రావు..

ప్రతిపక్ష పార్టీ నేతకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఆ పదవి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అరికెపూడి గాంధీకి ఆ పదవి కట్టబెట్టడం హాస్యాస్పదమన్నారు. అయితే.. పీఏసీ పదవి కోసం బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.

For Latest News and National News Click Here

Updated Date - Sep 09 , 2024 | 06:32 PM