Share News

TGSRTC: ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే కార్గో సేవలు

ABN , Publish Date - Oct 26 , 2024 | 08:21 PM

ఇంటికే RTC పార్శిళ్లు పార్శిళ్ల డెలివరీని మెరుగుపరిచేందుకు TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఇంటివద్దకే కార్గో సేవలు అందించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

TGSRTC: ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే కార్గో సేవలు

హైదరాబాద్: ఇంటికే RTC పార్శిళ్లు పార్శిళ్ల డెలివరీని మెరుగుపరిచేందుకు TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఇంటివద్దకే కార్గో సేవలు అందించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ముందుగా హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా రేపటి నుంచి చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు డెలివరీ ఛార్జీలను వెల్లడించారు.


ఇంతకు ముందు కార్గో డెలివరీ ఐటెమ్స్ తీసుకోవాలంటే.. బస్టాండ్‌కి వెళ్లాల్సి వచ్చేది. ఆదివారం నుంచి ఆ సరకులు డైరెక్టుగా ఇంటికే వస్తాయి. హోం డెలివరీ చేస్తారు. ఈ కార్గో సేవల్ని ముందుగా హైద‌రాబాద్‌లో ఫైల‌ట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభిస్తూ.. పార్శిళ్లను హోం డెలివ‌రీ చేయనున్నారు. త్వర‌లోనే రాష్ట్రవ్యాప్తంగా హోం డెలివ‌రీ సేవ‌లు ప్రారంభిస్తామని ఎండీ సజ్జనర్ తెలిపారు.

హోం డెలివ‌రీ చార్జీలను కూడా ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

  • 0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50

  • 1.01నుంచి 5 కేజీల‌కు రూ.60

  • 5.01 నుంచి 10 కేజీల‌కు రూ.65

  • 10.1 నుంచి 20 కేజీల‌కు రూ.70

  • 20.1 నుంచి 30 కేజీల‌కు రూ.75

  • 30.1 కేజీలు దాటితే.. రూ.75పైన

ఈ సర్వీసులు వద్దు అనుకునేవారు బస్టాండ్‌కే వెళ్లి డెలివరీ తీసుకోవచ్చు. హైదరాబాద్‌లో ప్రజల నుంచి వచ్చే స్పందన బట్టి, మార్పులు చూస్తూ సేవల్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇవి కూడాచదవండి..

TG Police: పోలీసు, పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారిన అజ్ఞాత వ్యక్తి లేఖ..

Jaggareddy: అవును.. వాళ్లను తిట్టాను.. తప్పేంటి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 26 , 2024 | 08:34 PM