Home » Crime
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(Kutubullapur MLA KP Vivekanand) పీఏ బండ మల్లేష్ పై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన్నే దామోదర్ ఈనెల 16వతేదీన జీడిమెట్ల(Jeedimetla) పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదుచేశారు.
సరికొత్త సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. కొరియర్ బాయ్ అనుచిత ప్రవర్తనపై కస్టమర్ ఫిర్యాదు చేస్తే.. నమోదు చేయాలంటే రూ. 10 చెల్లించాలని నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) అతడి ఖాతా నుంచి రూ. 4.68 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ కవిత(సైబర్ క్రైమ్ డీసీపీ కవిత) తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 67 ఏళ్ల వృద్ధుడికి ఫ్లిప్‌కార్ట్ పార్శిల్ వచ్చింది. కొరియర్ బాయ్ కస్టమర్‌ను పేరు పెట్టి గట్టిగా పిలిచాడు.
ఇన్స్టాగ్రామ్(Instagram)లో పరిచయమైన ఓ బాలికను ప్రేమ పేరుతో వంచించి పెళ్లి చేసుకున్నాడు. కాపురం పెడదామని తీసుకెళ్లి హత్యచేశాడో యువకుడు. మియాపూర్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్(Miyapur Inspector Krantikumar) తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ ప్రాంతానికి చెందిన దంపతుల కుమార్తె(17) 20 రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు.
ప్రేమించకపోతే ఎయిడ్స్(హెచ్ఐవీ) ఇంజక్షన్ ఇస్తా, చెప్పిన మాట వినలేదో మీ అమ్మానాన్నని చంపేస్తా.. అంటూ బెదిరిస్తున్న ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ యువతి శనివారం హయత్‌నగర్(Hayatnagar) పోలీసులను ఆశ్రయించింది.
నూతన వధూవరులు, కుటుంబ సభ్యులతో వస్తున్న వాహనం ఆకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వధూవరులతో సహా ఏడుగురి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ రోడ్డు ప్రమాదం ఉత్తర్ ప్రదేశ్ బిజ్నోర్‌లో చోటుచేసుకుంది.
డీహెచ్ఎల్ కొరియర్ సర్వీసు పేరుతో ముంబై నుంచి చైనాకు వెళ్తున్న పార్శిల్లో చట్టవ్యతిరేక వస్తువులు దొరికాయంటూ నగరానికి చెందిన యువకుడిని సైబర్ కేటుగాళ్లు(Cyber criminals) బెదిరించి రూ. 6.90 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 28 ఏళ్ల యువకుడికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు.
సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కాజేసిన డబ్బును రికవరీ చేసిన సైబర్‌క్రైం పోలీసులు బాధితుడి ఖాతాలో జమ చేయించారు. బ్యాంకు అధికారులమంటూ నగరానికి చెందిన వ్యక్తికి ఫోన్‌చేసిన సైబర్ నేరగాళ్లు.. క్రెడిట్ కార్డు లిమిట్(Credit card limit) పెంచుతామని చెప్పారు.
నకిలీ పత్రాలు, స్టాంపులు, సంతకాలతో నేపాలీలకు ఆధార్, ఓటర్, జనన ధ్రువీకరణ పత్రం, పాన్, పాస్‌పోర్ట్‌తో పాటు ఇతర అధికారిక పత్రాలను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, మహాకాళి పోలీసులు(North Zone Task Force, Mahakali Police) కలిసి అరెస్ట్ చేశారు.
అల్లూరి సీతారామరాజు(Alluri Seetharama Raju) జిల్లా జడ్డంగి గ్రామానికి చెందిన కొత్త ఆనంద్ హైదరాబాద్(Hyderabad) నగరంలో మియాపూర్ ప్రాంతంలోని ఓ కార్పొరేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నాడు. సమీప ఇంటిలో నివాసముంటున్న ఓ పదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.
ఎల్బీనగర్(LB Nagar)లో లా అండ్ ఆర్డర్ పోలీసులు, యాంటీ నార్కోటిక్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో రూ.16 లక్షల విలువ చేసే 3కేజీల 319గ్రాముల హాష్ ఆయిల్‌ను పట్టుకున్నారు. ఈ నార్కోటిక్ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ మావోయిస్టు సహా ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు.