Home » A Revanth Reddy
భారతీయ సనాతన ధర్మం ప్రసాదించిన సర్వశక్తిమంతమైన అంశాలతో ‘శ్రీ లలితా విష్ణు’ అంశాలు ప్రధాన భూమికలుగా చేసుకుని ఈ ఏటి బోనాల పర్వాల వేళ ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించడానికి ముఖ్య అతిధి స్థానంలో విచ్చేసే ప్రభుత్వ, రాజకీయ, సినీరంగాల భక్తులకు ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అమృతశక్తుల అపురూప రచనాసంకలనాన్ని ఉచితంగా సమర్పించడం మహంకాళి తల్లి అనుగ్రహ విశేషమేనని సికింద్రాబాద్ ఉజ్జయిని మహాహాకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు రామతీర్థ శర్మ పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ ఆషాఢ మాసంలో పురాణపండ శ్రీనివాస్ ఆర్షధర్మాల రమణీయ గ్రంధాన్ని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. లక్షల కొలది భక్తులకు ఇష్టమైన శ్రీ సహస్రనామాలు రెండింటితో ‘లలిత , విష్ణు’ల వెలుగులతో ముఖపత్రం శ్రీరాజరాజేశ్వరీదేవి మంగళ చిత్రంతో, వెనుక అట్టపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళానుగ్రహం కలగాలనే పవిత్ర స్వఛ్చ వాక్యనిర్మాణంతో ఈ గ్రంధం చోటుచేసుకోవడం విశేషం.