Home » Arvind Kejriwal
లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండటంతో 'ఇండిపెండెన్స్ డే' సందర్భంగా త్రివర్ణ పతాకం ఎవరు ఎగుర వేయాలనే దానిపై పరిశీలన జరిగింది. అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న అతిషిని త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కేజ్రీవాల్ ఆదేశించారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు.
ఇది హిందూ, ముస్లింలకు సంబంధించిన అంశంకాదని, పండుగ ప్రధాన స్ఫూర్తి దీపకాంతులను వెదజల్లడమే కానీ, పొగను వ్యాపింపజేయడం కాదని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాలుష్యం విషయానికి వచ్చినప్పుడు సంప్రదాయం కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, మహారాష్ట్రలో ప్రచారానికి రావాల్సిందిగా శివసేన-యూబీటీ, ఎన్సీపీ-ఎస్పీ నేతలు అరవింద్ కేజ్రీవాల్‌ను ఇటీవల కోరారు. ఇందుకు సానుకూలంగా కేజ్రీవాల్ స్పందించారు. ఆప్ కార్యకర్తలు ఉన్న ప్రాంతాల్లోనూ, వివాద రహిత అభ్యర్థులు ఉన్న చోట్ల ప్రచారానికి ఆయన అంగీకరించారు.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన 12 నెలలో ఇంధనం, విద్యుత్ ధరలను సగానికి సగం తగ్గిస్తామని, పర్యావరణ అనుమతులను వేగిరపరచడం ద్వారా విద్యుత్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.
బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం రాష్ట్రాల్లో విఫలమైందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. డబుల్ ఇంజన్ మోడల్‌ను 'డబుల్ లూట్, డబుల్ కరప్షన్'గా అభివర్ణించారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు.
కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన 2015 నుంచి సివిల్‌లైన్స్‌లోని 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డు నివాసంలోనే ఉంటున్నారు. సీఎంగా రాజీనామా చేసిన తర్వాత అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.
2013లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టే ముందు ఘజియాబాద్‌లోని కౌశంబి ప్రాంతంలో నివసించే వారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సెంట్రల్ ఢిల్లీలోని తిలక్ లేన్‌కు మకాం మార్చారు. ఇక 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది.