Home » CM Stalin
భారతదేశంపై, భారత రాజ్యాంగంపై ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)కు నమ్మకంలేదని, ఆయనకు అహంకారం ఎక్కువని గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) చేసిన ఆరోపణలపై సీనియర్ మంత్రి దురైమురుగన్(Senior Minister Duraimurugan), ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి మండిపడ్డారు.
ద్రావిడ తరహా డీఎంకే పాలనలో మహిళా సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాల వల్ల లబ్ధిపొందుతున్న మహిళలంతా తనను ‘నాన్నా..! నాన్నా’ అని పిలుస్తుండటం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని, ఆ పిలుపొక్కటే సుపరిపాలనకు నిదర్శనమని సీఎం స్టాలిన్ అన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin), అందరికి మూడు నెలల ‘రీచార్జ్’ చేస్తున్నారంటూ సామాజిక మాద్యమాల్లో వస్తున్న మెసేజ్‌లు నమ్మరాదని సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber Crime Police) హెచ్చరిస్తున్నారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ఆదేశాల మేరకు రాష్ట్ర ఆలయాల తరపున అయ్యప్ప భక్తులకు బిస్కెట్ ప్యాకెట్ల(Biscuit packets)ను పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం రెండో దశగా మరో 5 లక్షల బిస్కెట్ ప్యాకెట్ల లోడు వాహనానికి దేవాదాయ శాఖామంత్రి పీకే శేఖర్ బాబు(Minister PK Shekhar Babu) జెండా ఊపి ప్రారంభించారు.
రెండు రోజుల క్రితం వరకు ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్(K. Balakrishnan)కు ఏమైందని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని విమర్శించడం మతిభ్రమించినట్లుగా ఉందని హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu) విమర్శించారు.
రాష్ట్రంలో వామపక్షాలతో పొత్తుపెట్టుకుని ఏడేళ్లుదాటినా తమ కూటమి చెక్కుచెదరకుండా కొనసాగుతోందని కామ్రేడ్ నల్లకన్నులాంటి కమ్యూనిస్టు దిగ్గజాలు తనకు అండగా ఉన్నందున రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 200 సీట్లకు పైగా గెలుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ద్రావిడ తరహా పరిపాలనను అపహాస్యం చేస్తున్నవారికి ఇక ద్రవిడ ఉద్యమనేత పెరియార్ ఊతకర్రే తగిన విధంగా సమాధానం చెబుతుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) వ్యాఖ్యానించారు.
మూడేళ్ల ద్రావిడ తరహా పాలన చూసి అన్ని వర్గాలవారు మెచ్చుకుంటున్నారని, రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి పసలేని విమర్శలు చేస్తున్నారని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ఆగ్రహం వ్యక్తం చేశారు.
జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. లోక్‌సభకు, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులకు గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
తమిళనాడు విద్యుత్ బోర్డు (టీఎన్ఈబీ)లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమేనా అని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. భారత సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి సౌర విద్యుత్ కొనుగోలు చేసేందుకు టీఎన్ఈబీకి ఆదానీ సంస్థ ముడుపులు చెల్లించినట్లు అమెరికా కోర్టులో దాఖలైన కేసుపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అన్బుమణి డిమాండ్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.