Home » Drugs Case
మానవాళికి ఆరోగ్య ముప్పుగా పరిణమిస్తున్న యాంటీబయోటిక్ ఔషధ నిరోధకతను (ఏఎంఆర్) ఎదుర్కొనేందుకు పాత వైద్య విధానమైన బ్యాక్టీరియోఫేజ్ థెరపీ చక్కగా ఉపయోగపడుతుందని ఇన్ఫెక్షన్ వ్యాధుల నిపుణుడు డాక్టర్ కే కల్యాణ్ చక్రవర్తి తెలిపారు.
పశ్చిమ ఢిల్లీలో సుమారు రూ.900 కోట్లు విలువ చేసే 82 కిలోల నాణ్యమైన కొకైన్‌ను శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ వేదికగా కాన్సర్ట్ నిర్వహించనున్న పంజాబీ సింగర్ కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. పాటల్లో అభ్యంతరకర విషయాల జోలికి వెళ్లొద్దంటూ సూచించింది.
యువత గంజాయికి బానిస అవుతోంది. ఒకప్పుడు ఎక్కడైన గొడవలు జరిగితే.. ‘మద్యం మత్తులో’ అని పోలీసులు చెప్పేవారు. ఇప్పుడు చెప్పకపోయినా.. ‘గంజాయి మత్తులో’ అని తేటతెల్లమౌతోంది. ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణలు, హత్యలు, లైంగిక వేధింపులు, రోడ్డు ప్రమాదాలు, చోరీలకు గంజాయి మత్తే కారణమని పోలీసులే చెబుతున్నారు. మురికివాడలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, శివారు ప్రాంతాలలో ...
డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ.. అడ్డంగా దొరికన ఓ విదేశీ మహిళకు ఎల్బీ నగర్‌లోని రంగారెడ్డి అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆమెకు 13 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. లక్ష జరిమానా విధించింది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ హెరాయిన్ విలువ రూ. 25 కోట్లకు పైనే ఉంటుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు ఇవాళ(శుక్రవారం) తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. వీటి విలువ సుమారుగా రూ. 13 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాంకాక్ నుంచి వస్తున్న హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నట్లు వెల్లడించారు.
Telangana: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు 13 కోట్ల రూపాయల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తి వద్ద భారీ మొత్తంలో గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Telangana: పక్కా సమాచారంతో నిన్న (గురువారం) చందానగర్‌లో ఓ ఇంటిపై దాడి చేసి పోలీసులకు భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో 18 లక్షల విలువ చేసే 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. అయితే కేసులో అసలు ట్విస్ట్‌ను బయటపెట్టారు పోలీసులు.
ఫాంహౌస్ ఘటనలో హైకోర్టు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియటంతో బుధవారం విచారణకు రాజ్ పాకాల హాజరవుతున్నారు. కాగా మంగళవారం రాత్రి విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని ఫోన్ స్వాధీనం చేసుకొనే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి తుని మీదుగా కేరళ రాష్ట్రానికి గంజాయి సరఫరా చేస్తున్నారన్న పక్కా సమచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. రెండు బృందాలుగా ఏర్పడి వి.మాడుగుల, కొత్తకోట సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.