Home » Goverment order
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత ఇసుక పథకాన్ని పకడ్బందీగా అమలుచేయడానికి ప్రణాళి కను సిద్ధంచేసింది. కేవలం ఇసుకతీత, ఎగుమతి, పరిపా లనాపరమైన చార్జీలు, రవాణా చార్జీలతోనే ఇసుకను లబ్ధి దారులకు చేరేలా చేయడం ప్రభుత్వ లక్ష్యం. ఇసుక తవ్వ కం, లోడింగ్ రూ.30, రీలోడింగ్‌కు రూ.30, సీనరేజి రూ. 66, జీఎస్టీ 18శాతం, డిస్ర్టిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) రూ.19.68, మెరిట్ (ఖనిజాన్వేషన్ నిధి) 2 శాతం వసూ లుచేస్తారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మోనటరింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించింది.
ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా ‘చోప్రా’ ఘటన వీడియోపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్ స్పందించారు. ఈ ఘటనపై ఆయన షాక్‌కు గురయ్యారు. ఇది అనాగరికమైన చర్య అని అభివర్ణించారు.
వందలాది మంది ఉద్యోగుల మెడపై జగన ప్రభుత్వం, సమగ్రశిక్ష అధికారులు కత్తి పెట్టారు. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే ఒక రోజు బ్రేక్ ఇచ్చి.. ఆ ఏడాది కాలానికి ఉద్యోగుల కాంట్రాక్టును రెన్యువల్ చేసేవారు. అయితే ఈ ఏడాది 40 రోజులకు మాత్రమే రెన్యువల్ చేశారు. ఆ తర్వాత ఉద్యోగుల భవిష్యత్తు ఏమిటి...? కొనసాగిస్తారా..? ఉద్వాసన పలుకుతారా..? తేలాల్సి ఉంది. ఈ ఉత్తర్వులు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. జగన ప్రభుత్వ నిర్ణయంపై కేజీబీవీ ఉద్యోగులు మండిపడుతున్నారు....
సమగ్రశిక్ష ప్రాజెక్టులో ఓ ఉన్నతాధికారి బరితెగించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఖాతరు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. బుక్కరాయసముద్రంలోని శిక్షణా కేంద్రానికి ఓ కంప్యూటర్ ఆపరేటర్‌ను అనామతుగా తీసుకున్నారు. ఉద్యగం భర్తీ పేరిట దరఖాస్తు కూడా స్వీకరించారని విశ్వసనీయ సమాచారం. ‘కలెక్టర్‌కు మనం ఎంత చెబితే అంత..’ ...
‘మీరు నవ్వుకున్నా సరే! నేను చేసేది చేస్తా! తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలనే అమలు చేస్తా!’... ఇదీ ఆ మహిళా ఐఏఎస్ వ్యవహార శైలి! అర్హులను మూలకు తోసేసి.. అస్మదీయులకు బిల్లులు చెల్లించడమే అంతిమ లక్ష్యం.