Home » Guntur
వైసీపీ హయాంలో టీటీడీ పాలకవర్గంలో పని చేసిన ఆ పార్టీ నేతలపై హిందూ సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల లడ్డూ విషయంలో తమ మనోభావాలతో ఆటలాడుకున్నారంటూ టీటీడీ ఛైర్మన్ మాజీ వై.వి.సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిపై గుంటూరు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీవారి లడ్డూ వ్యవహారంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై దుష్ర్పచారం జరుగుతోందంటూ సీనియర్ కౌన్సిల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కేసులో ఎట్టకేలకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
ఇచ్చిన హామీ మేరకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సైనికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసింది. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే హామీ నెరవేర్చారని మాజీ సైనికులు గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులకు ప్యాకేజీ ప్రకటించారు. ఈ మేరకు ప్యాకేజీ వివరాలతో కూడిన సమాచారాన్ని తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ(బుధవారం) నిర్వహించే ఏపీ క్యాబినెట్ సమావేశంలో మద్యం విధానంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం 11గంటలకు జరిగే సమావేశంలో మంత్రులు పాల్గొని కీలక అంశాలపై చర్చించనున్నారు.
తెలుగునాట ప్రసిద్ధి చెందిన హరికథకుడు కోట సచ్చిదానంద శాస్త్రి(90) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గుంటూరు అమరావతి రోడ్డులోని నివాసంలో సోమవారం అర్ధరాత్రి మృతి చెందారు.
Andhrapradesh: ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. స్వచ్చంధంగా ఐపీఎస్‌లు రాజీనామా చేసి వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. సజ్జల వలనే తాము ఈ విధంగా చేశామని చెబితే వారి గౌరవం పెరుగుతోందన్నారు.
సమాజం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కష్టపడే తత్వం, మంచి బుద్ది, జ్ఞానం, సరిపడినంత ధనం, ధైర్యం కలిగిన తనలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి అవసరమైన సాయం చేయకుంటే సమాజం బాగుపడదనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన వివరించారు.
గుంటూరు జిల్లా: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను న్యాయస్థానం పోలీసు కస్టడికి అనుమతి ఇచ్చింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి 17వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం మంగళగిరి పోలీసులు రూరల్ స్టేషన్లో విచారించనున్నారు. తెలుగుదేశం ప్రధానకార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారించనున్నారు.