Home » Heavy Rains
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనుండగా, అదే సమయంలో రాష్ట్రంలో శుక్రవారం నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, నగరంలో, సబర్బన్ ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.
దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాల వేళ వరణుడు పలుచోట్ల ఆటంకం కలిగించాడు. అంతేకాదు వచ్చే రెండు, మూడు రోజులు కూడా వర్షాలు ఉన్నాయని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. అయితే ఏ ప్రాంతాల్లో ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణలో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా కూల్‌గా మారింది. ఓ వైపు సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటుతుండగా.. వేడితో అల్లాడుతున్న హైదరాబాద్‌వాసులకు వాన జల్లులు పలకరించాయి.
గత నెలలో కురిసిన భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు రూ.79.57కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో గత నెలలో భారీ వర్షాలు పడ్డాయి. పలు జిల్లాల్లో భారీ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా విజయవాడలోని బుడమేరు ఉధృతంగా పొంగి ప్రవహించింది. దీంతో లోతట్టు కాలనీలను వరద ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయిందని సీపీఎం సీనియర్ నేత సీ హెచ్ బాబూరావు ఆరోపించారు, వరదల వల్ల రాష్ట్రంలో పదకొండున్నర లక్షల మంది ఇబ్బందులు పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బీభత్సం సృష్టించిన వర్షాలు మళ్లీ వచ్చేశాయి. ఈ క్రమంలో రేపటి (అక్టోబర్ 4) నుంచి పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లిలో ఇద్దరు మహిళా కూలీలు, భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లిలో ఓ మహిళా రైతు మృతి చెందారు.
నీలగిరి(Neelagiri) జిల్లా కున్నూరు మౌంట్‌రోడ్ కృష్ణాపురం ప్రాంతంలో కుండపోతగా కురిసిన భారీ వర్షాల కారణంగా సోమవారం వేకువజాము ఓ ఇంటి ముందు మట్టిపెళ్లలు పడటంతో ఓ ఉపాధ్యాయురాలు దుర్మరణం చెందారు. కున్నూరు పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి కూడా కున్నూరు అంతటా భారీగా వర్షాలు కురిశాయి.