Home » Jammu and Kashmir
Rajnath Singh: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతం లేకుంటే జమ్మూ కశ్మీర్ అసంపూర్ణమని ఆయన పేర్కొన్నారు.
సరిహద్దుల భద్రత, చొరబాట్ల నిరోధక చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన మందుపాతరపై గస్తీ జవాను ఒకరు కాలు వేయడంతో అది పేలిందని, దీంతో ఆరుగురు జవాన్లు స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
‘ఇక్కడ ఉన్నది మోదీ.. మాటిస్తే తప్పడంతే’ అని ప్రధాని మోదీ అన్నారు. జమ్మూకశ్మీరుకు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని ఆ కేంద్రపాలిత ప్రాంతం సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన వినతిపై ఆయన స్పందిస్తూ.. ప్రతి దానికీ ఓ సమయం ఉంటుందన్నారు.
శ్రీనగర్-లడఖ్ జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా సోన్మార్గ్లోని జెడ్-మోర్ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సోమవారం కశ్మీర్ పర్యటనకు వెళ్లిన ప్రధాని ఆ ప్రతిష్టాత్మక టన్నెల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోపాటు జమ్ము, కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు.
సోన్మార్గ్ టన్నెల్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇందుకు సంబంధించి పెట్టిన ఒక పోస్టుపై ప్రధాని మోదీ వెంటనే స్పందించారు. టన్నెల్ ప్రారంభోత్సవానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ట్వీట్ చేశారు.
రోడ్డు జారుడుగా ఉండటంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందని, స్థానికులు, సహాయక బృందాలు వెంటనే అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారని అధికారులు తెలిపారు.
భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. అంతేకాదు ఈ ప్రభావం జనవరి 1, 2 తేదీల్లో కూడా ఉంటుందని అక్కడి వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఇది ఎక్కడ ఉంది, ఎన్ని రోజులు ఉంటుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
Year Ender 2024: ఈ ఏడాది ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్లో జరిగిన కాల్పుల్లో 75 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. వారిలో 60 శాతం మంది విదేశీయులేనని తెలిపారు.
చలిగాలులతో ఉత్తర భారతదేశం గడ్డకట్టుకుపోతోంది. జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లను మంచు దుప్పటి కప్పేస్తోంది.
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం 350 అడుగుల లోయలో పడి అయిదుగురు మృతి చెందగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు.