Home » Kishan Reddy G
పురాతన కాలం నుంచే భారతీయ సైద్ధాంతికత ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, భారతీయుల మత విశ్వాసాలు, కళలు, సాంకేతిక పరిజ్ణానం, భాష, సాహిత్యం విశ్వవ్యాప్తంగా గౌరవం పొందాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
హిందూ దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులు ఉండడం వల్లే అభిప్రాయ భేదాలు వస్తున్నాయని, వారిని ఇతర శాఖల్లో పంపడమే మంచిదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
టీటీడీ పాలక మండలి పలు సంచలన నిర్ణయాలను తీసుకుంది. దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ బోర్డు భక్తుల కోసం చాలా మంచి నిర్ణయాలు తీసుకుందని కిషన్‌రెడ్డి తెలిపారు.
రేవంత్ రెడ్డి పాలనపై బీజేపీ అగ్రనేతలు కిషన్ రెడ్డి, డీకే అరుణలు విమర్శలు గుప్పించారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే శాంతి భద్రతలు లేవని డీకే అరుణ ఆరోపించారు. బీజేపీ అంటే ఏమిటో ఈ సర్కార్‌కు చూపిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఫొటో షూట్ కోసమే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మూసీ నిద్రకు వెళ్లారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో 3 నెలలుంటే అక్కడి సమస్యలు తెలుస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి అంటే.. 12 గంటల ఉండి ఫొటో షూట్ చేసుకుని వచ్చారన్నారు.
మిడ్ మానేర్ రిజర్వాయర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన 4,696 మందికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
మూసీ పరీవాహక ప్రాంతాన్ని ప్రక్షాళన చేసే ముందు అక్కడ ఏళ్లుగా నివసిస్తున్న పేదలను ఒప్పించాలని, వారి అనుమతితో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచించారు.
ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్ తరహాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా గుజరాత్‌కు గులాముగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి వ్యక్తం చేసిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
తాము ఎవరిని రెచ్చగొట్టడం లేదని, వాళ్లు మూసీ విడిచి వెళతామంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు కృష్ణా , గోదావరి నీళ్లు తెస్తాం అంటే సంతోషమేనన్నారు. అది మూసీ ప్రక్షాళన పేరిట ఇండ్లను కూలగొట్టి ఇస్తాం అంటే కుదరదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తెలంగాణను ఆగం చేసే పనికి శ్రీకారం చుట్టిందని విమర్శించారు.