Home » Kodi Kathi
విశాఖ ఎన్ఐఏ కోర్టులో ఇవాళ (శుక్రవారం) జరిగిన కోడికత్తి కేసు విచారణకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హాజరు కాలేదు. జగన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్, ఆయన తరఫు న్యాయవాది సలీం, దళిత సంఘాల నేతలు కోర్టుకు వచ్చారు.
‘కోడికత్తి’ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
కోడికత్తి కేసులో సుప్రీం కోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ రద్దుకు సుప్రీం కోర్ట్ నిరాకరించింది.
కోడికత్తి శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదివారం ముమ్మడివరం కూటమి అభ్యర్థి, టీడీపీ నాయకుడు దాట్ల బుచ్చిబాబు సమక్షంలో కోడికత్తి శ్రీను ఆ పార్టీలో చేరారు. అనంతరం కోడికత్తి శ్రీను మాట్లాడుతూ... వైసీపీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం.. చేసిన ప్రయత్నం వల్ల తాను ఐదేళ్లు జైల్లో మగ్గాల్సి వచ్చిందన్నారు. జైలు నుంచి తన విడుదల కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
2024 ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైయస్ జగన్... 2019 ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా నాటి ఘటనలనే ఫాలో అవుతున్నారా? అంటే అవుననే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఏఫ్రిల్ 13వ తేదీ రాత్రి విజయవాడలోని సింగ్ నగర్లో వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనపై ఆగంతకులు రెండు రాళ్లు వేశారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో ప్రజాగళం బహిరంగ సభకు విచ్చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ను అడ్వకేట్ గుణ్ణం వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జనుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను కుటుంబం గురువారం కలిసింది.
శవం ఎదురొస్తే.. మంచి శకునమని శకున శాస్త్రం చెబుతుంది. అయితే ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కి మాత్రం ‘శవ రాజకీయం’ బాగా కలిసి వస్తుందనే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తన తండ్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం నాటి నుంచి నేటి వరకు వైయస్ జగన్ శవ రాజకీయాన్నే ఆలంబనగా చేసుకొని ముందుకు సాగుతున్నారనే ఓ ప్రచారం సైతం సదరు సర్కిల్లో నడుస్తోంది.
: జై భీమ్ రావు భారత్ పార్టీలో కోడికత్తి శ్రీనివాస్ చేరారు. ఈరోజు గాంధీ నగర్ జై భీమ్ రావు భారత్ పార్టీ కార్యాలయంలో శ్రీను ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇప్పటికే మాజీ మంత్రి వివేకారెడ్డి హత్య కేసులో అప్రువర్‌గా మారిన దస్తగిరి పార్టీలో చేరారు.
సీఎం జగన్ రెడ్డి(CM Jagan) గత ఎన్నికల్లో మాజీమంత్రి వివేకానందారెడ్డి (బాబాయ్) హత్య, కోడి కత్తి శీను పేరు చెప్పి లాభం పొందారని మాజీ ఎంపీ హర్ష కుమార్(Harsha Kumar) అన్నారు. శనివారం నాడు హర్ష కుమార్‌ను కోడి కత్తి శీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు.
Andhrapradesh: కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఉదయం ఎన్ఐఏ కోర్టు జడ్జ్ సెలవులో ఉండడంతో ఎన్ఐఏ ఇంచార్జ్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. ఈ కేసులో బెయిల్ తర్వాత తొలిసారిగా కోడికత్తి శ్రీను కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణను ఏప్రిల్ 19కి ఏన్ఐఏ ఇంచార్జ్ కోర్టు వాయిదా వేసింది.