Home » Lawrence Bishnoi
సిద్ధిఖి హత్య వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చిన్న సోదరుడైన అన్మోల్ ఉన్నట్టు అనుమానిస్తుండగా, అన్మోల్ ప్రస్తుతం కెనడాలో ఉన్నట్టు సమాచారం. ముంబైలోని బాంద్రా ఏరియాలో సిద్దిఖిని అక్టోబర్ 21న ముగ్గురు సాయుధులు కాల్చిచంపారు.
కొత్త ట్రెండ్ ను సెట్ చేసే ప్రయత్నంలో ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్లైన్ సంస్థలు అత్యుత్సాహం చూపుతున్నాయి. నైతిక విలువలను మరిచి పలు ఉత్పత్తులను సేల్‌లో ఉంచడంతో ఇప్పుడు పోలీసు కేసును ఎదుర్కొటున్నాయి.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్ష్యంగా బెదిరింపు సందేశం రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. యోగికి మరింత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబై పోలీసులకు నిన్న సాయంత్రం మెసేజ్ వచ్చింది. ఆ వెంటనే లక్నో పోలీసులను అప్రమత్తం చేశారు. కాల్ చేసింది ఎవరు..? ఎక్కడి నుంచి ఫోన్ చేశారని ఆరా తీస్తున్నారు.
బిహార్‌లోని పూర్ణియాకు చెందిన ఇండిపెండెంట్ ఎంపీ పప్పూ యాదవ్‌ను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు ఒకడు బెదిరించాడు.
రెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి చంపుతామంటూ బెదిరింపులు రావడంతో తనకు భద్రత పెంచాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పప్పూ యాదవ్ లేఖ రాశారు. తనకు 'జడ్' కేటగిరి భద్రత కల్పించాలని కోరారు. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపుల కారణంగానే ఈ భద్రతను కోరుతున్నట్టు ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
అప్పట్లో తీవ్ర కలకలం రేపిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ వ్యవహారంపై పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఓ నేరస్తుడిని ఇంటర్వ్యూ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం రాజ్ షెకావత్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్కౌంటర్ చేసిన పోలీసుకు కోటి 11లక్షల 11వేల 11వందల 11 రూపాయిల రివార్డ్ ఇస్తామని తెలిపారు. కర్ణిసేనకు చెందిన సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి..