Home » Madras High Court
టీనేజీ దశలోని యువతీయువకులు పరస్పర ఇష్టంతో చేసుకునే కౌగలింతలు, పెట్టుకునే ముద్దులను క్రిమినల్ చర్యలుగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ స్పష్టం చేసింది.
యువ జంటల మధ్య చుంబనాలు, ఆలింగనాలు సహజమేనని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ చర్యలను సెక్షన్ 354 ఏ(1)(i) కింద నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం, వీడియోలు డౌన్లోడ్ చేయడం పోక్సో చట్టం ప్రకారం నేరమని సుప్రీంకోర్ట్ తీర్పునిచ్చింది. కేవలం చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేయడం, చూడటం పోక్సో చట్టం ప్రకారం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే లంచంలో భార్యకు భాగస్వామ్యం ఉంటే ఆమె కూడా శిక్షకు అర్హురాలేనని మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ అభిప్రాయపడింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో భర్తతో పాటు భార్యకు కూడా శిక్ష వేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయడానికి తిరస్కరించింది.
డీఎంకే ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు సీనియర్ మంత్రులకు మద్రాస్ హైకోర్టు(Madras High Court) షాకిచ్చింది. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారన్న కేసులో వారిద్దరికీ విముక్తి కల్పిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
కల్లు విక్రయాలపై విధించిన నిషేధం ఎత్తివేయడంతో పాటు, సూపర్ మార్కెట్లు, రేషన్ దుకాణాల్లో(Supermarkets, ration shops) మద్యం విక్రయాలు చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అభిప్రాయం చెప్పాలని మద్రాస్ హైకోర్టు(Madras High Court) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మన భారతదేశంలో వ్యభిచారం అనేది చట్టవిరుద్ధం. ఈ విషయం తెలిసి కూడా తమిళనాడుకు చెందిన ఓ న్యాయవాది వింత పిటిషన్ వేశాడు. తనకు వ్యభిచార గృహం నడిపేందుకు గాను రక్షణ కల్పించాలని..
దారుణ హత్యకు గురైన బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు విభాగం అధ్యక్షుడు కె.ఆర్మ్‌స్ట్రాంగ్ భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయం ఆవరణలో ఖననం చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు ఆదివారంనాడు తోసిపుచ్చింది. చైన్నైలోని పార్టీ కార్యాలయం వద్ద తన భర్త మృతదేహాన్ని ఖననం చేయాలని కోరుతూ ఆర్మ్‌స్ట్రాంగ్ భార్య కె.పోర్కోడి ఈ పిటిషన్ వేశారు.
అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ.పన్నీర్‌సెల్వంకు మద్రాసు హైకోర్టులో సోమవారంనాడు చుక్కెదురైంది. అన్నాడీఎంకే అధికారిక లెటర్‌హెడ్, రెండాకుల గుర్తు, పార్టీ జెండాను ఆయన వినియోగించుకోరాదని కోర్టు తీర్పునిచ్చింది.
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉపశమనం లభించింది. సనాతన ధర్మంపై ఉదయనిధితోపాటు మరో ఇద్దరు డీఎంకే నేతలు చేసిన వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో కొందరు పిటిషన్ దాఖలు చేశారు.