Home » Magunta Sreenivasulu Reddy
ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం తొలినాళ్లలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ.. ఎక్కువసార్లు కాంగ్రెస్ అధిక్యం కొనసాగింది. రాన్రాను మారిన పరిస్థితుల నేపథ్యంలో తొలుత టీడీపీ, ఆ తర్వాత వైసీపీలకు ఒంగోలు పార్లమెంట్ స్థానంలో ఆదరణ లభించింది. ఆ క్రమంలో ఇక్కడకు 1996లో నెల్లూరు నుంచి వచ్చిన మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు అందరికన్నా ఎక్కువగా ఆదరించగా ఆ కుటుంబం ఈ ప్రాంతాన్ని రాజకీయ కేంద్రంగా మార్చుకొని స్థానికులుగా ముద్రపడిపోయారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ మాగుంట కుటుంబం నుంచి పోటీలో ఉంటూనే ఉన్నారు
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముని గిపోతున్న నావలా తయారైంది. ఎన్నికలకు ముందే రాజకీయ దిగ్గజాలు ఆపార్టీని వీడుతున్నారు. ఒకరిద్దరంటే అనుకోవచ్చు.. పదుల సంఖ్యలో ప్రముఖ నాయకులు జగన్‌కు గుడ్‌బై చెబుతున్నారు.. వేల సంఖ్యలో ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీని వదిలి వెళ్లిపోతున్నారు.
TDP MP Candidates: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి.. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చిన టీడీపీ (TDP).. తాజాగా పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది..
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి మరో ఝలక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ(Ongole)మాగుంట శ్రీనివాసులు రెడ్డి(Magunta Srinivasulu Reddy).. తెలుగుదేశం(TDP) గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. మార్చి 16వ తేదీన మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి కూడా టీడీపీ కండువా కప్పుకోనున్నారు. 16న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలో చంద్రబాబు సమక్షంలో..
Andhrapradesh: టీడీపీలో చేరేందుకు తమ కుటుంబం సంసిద్ధంగా ఉందని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా అబ్బాయి రాఘవరెడ్డితో కలిసి టీడీపీలో చేరుతాను. ఏ రోజు టీడీపీలో చేరాలో చంద్రబాబు నిర్ణయిస్తారు. మాగుంట రాఘవరెడ్డి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరాను. మాగుంట రాఘవరెడ్డిని ఆశీర్వదించాలని ప్రజల్ని కోరుకుంటున్నాను’’ అని వెల్లడించారు.
Andhrapradesh: ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని టీడీపీ నేతలు కలిశారు. సోమవారం ఉదయం ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతలను అల్పాహార విందుకు ఎంపీ ఆహ్వానించారు. ఈ క్రమంలో మాగుంట ఇంట్లో మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, బిఎన్ విజయ్ కుమార్, అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ ఛార్జ్ ఎరిక్షన్ బాబు, దర్శి ఇన్ ఛార్జ్ రవికుమార్ భేటీ ఆయ్యారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాగుంట రాఘవ అప్రూవర్ అభ్యర్థనకు రౌజ్ అవెన్యూ కోర్టు ఓకే చెప్పింది. న్యాయమూర్తి నాగ్ పాల్ ఈ రోజు ఉత్తర్వులు వెలువరించారు. తాజా పరిణామాలతో ఢిల్లీ లిక్కర్ కేసు.. సీబీఐ కేసులో మాగుంట రాఘవ అప్రూవర్‌గా మారారు. ఈడీ దాఖలు చేసిన కేసులో ఇప్పటికే మాగుంట రాఘవ అప్రూవర్‌గా మారారు.
ప్రకాశం: జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లా రాజకీయ జన్మనిచ్చిందన్నారు.
AP Elections 2024: కష్టాల్లో ఉన్నప్పుడు రారమ్మని పిలిచారు. అధికారంలోకి రాగానే ఎదురుదాడి ప్రారంభించారు. తొలుత ఆర్థిక వనరులపై దాడి. ఆ తర్వాత ఆయన మాటచెల్లకుండా అధికారులపై ఆంక్షలు. ఇంకోవైపు కేంద్రం నుంచి అభివృద్ధి పనులకు నిధులు తెస్తే రాష్ట్రా వాటా నిధులివ్వకుండా అడ్డుకోవడం. ఎదురువెళ్లి నమస్కరించినా అగౌరవపరిచి పొమ్మనకుండా పొగబెట్టడం. తాజాగా సోషల్ మీడియాలో పాపమంతా బీజేపీదే అన్న అసత్య ప్రచారాలకు దిగడం.
AP CM YS Jagan Vs MP Magunta At Parliament: అవును.. మీరు వింటున్నది నిజమే.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని (MP Magunta Sreenivasula Reddy) ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (CM YS Jagan Reddy) ఘోరంగా అవమానించారు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) వేదికగా ఈ ఘటన చోటుచేసుకుంది..