Home » Narendra Modi
గోద్రా ఘటన వెనుక నిజాలు, 2002లో ఏమి జరిగింది, మీడియా పాత్ర ఏమిటి అనే ఘటనల చుట్టూ రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. పంచమహల్ జిల్లాలోని గోద్రా పట్టణంలో 2002 ఫిబ్రవరి 27న సబర్మతి ఎక్స్ప్రెస్కు కొందరు దుండగులు నిప్పుపెట్టడంతో 59 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
సరిహద్దు భద్రతా బలగాల అప్రమత్తత, ధైర్యం మన దేశ భద్రతకు దోహదపడతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సరిహద్దు భద్రతా బలగాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రుణమాఫీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. దొరల గడీలను కూల్చారని చెప్పారు. పాలమూరులో కృష్ణమ్మ పారుతున్నా ప్రజల కష్టాలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారం తమ జన్మహక్కుగా భావిస్తూ వచ్చిన వాళ్లు పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరమయ్యారని, తమను కాకుండా వేరేవారికి ప్రజలు ఆశీర్విదించడం గిట్టక మొదటి రోజు నుంచే ప్రజలపై కన్నెర్ర చేశారని విపక్షాలకు చురకలు వేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగం 75 సంవత్సరాల ప్రయాణం గురించి గుర్తుచేశారు. దీంతోపాటు మరికొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు.
గత రికార్డులను మహారాష్ట్ర బద్ధలు కొట్టిందని, గత 50 ఏళ్లలో ఏ పార్టీ కానీ, ఎన్నికల ముందు పొత్తులుపెట్టుకున్న కూటములు కానీ సాధించని అతిపెద్ద విజయం ఈసారి నమోదైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన 'మహాయుతి కూటమి'కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇది అభివృద్ధికి, సుపరిపాలనకు ప్రజలు అందించిన విజయమని అభివర్ణించారు.
రాష్ట్రంలో 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi), హోం మంత్రి అమిత్షా(Amit Shah) రూపొందించబోయే కొత్త వ్యూహరచనతో పాలనలో మార్పు తథ్యమని, బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ కార్యాచరణ కమిటీ సభ్యురాలు, నటి ఖుష్బూ పేర్కొన్నారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహించే వార్షిక సదస్సులో మొదటిసారిగా బాంబు బెదిరింపుల అంశంపై చర్చించనున్నారు. వచ్చే వారం జరగనున్న ఈ బేటీకి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా అన్ని రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు.
నైజీరియాలో తొలి పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం (నవంబర్ 18న) బ్రెజిల్ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ జరిగే జీ-20 సదస్సులో పాల్గొననున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.