Home » Personal finance
మనకు ఏదైనా డబ్బు అవసరమైనప్పుడు ప్రజలు ముందుగా ఆలోచించేది ఓవర్ డ్రాఫ్ట్ లేదా పర్సనల్ లోన్ వైపు మొగ్గు చూపడం. మన దగ్గర పొదుపు లేదా అత్యవసర నిధి లేనప్పుడు ఇలాంటివి ఎంచుకోక తప్పదు. అయితే వీటిలో ఏది ఉత్తమం అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Personal Loan: ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. దసరా ముగిసింది. ధన్‌తేరాస్, దీపావళి వంటి ప్రధాన పండుగలు సమీపిస్తున్నాయి. దీంతో ప్రజలంతా షాపింగ్ కోసం సిద్ధమవుతున్నారు. మీరు కూడా షాపింగ్ చేయాలని భావిస్తున్నారా.. డబ్బులు లేక పర్సనల్ లోన్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా..
పెన్షనర్లు మరింత సులభంగా, ప్రభావవంతంగా ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులను 21 రోజుల్లోగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఫిర్యాదు పరిష్కారానికి మరింత అదనపు సమయం అవసరమైతే దరఖాస్తుదారులకు ఆలస్యానికి సంబంధిన సమాచారాన్ని అందిస్తారు.
ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి ఇల్లు కట్టుకోలేనివారు చాలా మంది ఉంటారు. అలాంటివారు బ్యాంకు రుణాలపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అయితే ఆఫర్లు ఉన్నప్పుడు గృహ రుణాలు తీసుకుంటే ఎంతోకొంత ప్రయోజనం ఉంటుంది. అలాంటి ప్రత్యేక ఆఫర్ కోసం ఎదురుచూసేవారికి తరుణం ఆసన్నమైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి.
మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని సేవింగ్స్‌లో బ్యాంకులో ఎమర్జెన్సీ ఫండ్‌గా పెట్టుకుని మిగతా మొత్తాన్ని పెట్టుబడిగా మారిస్తే మంచి లాభాలు కళ్లచూడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన వారు రెండు కంటే ఎక్కువ సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరిచినట్లయితే.. ఉపయోగించని ఖాతాలను వెంటనే మూసివేయాల్సి ఉంటుందని ఆర్థిక వ్యవహారాల విభాగం తెలిపింది. ఒకవేళ అలా చేయకపోతే సుకన్య యోజన స్కీమ్-2019 మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్న ఖాతాలను గుర్తించి.. సరైన మార్గదర్శకాలు పాటించని వాటిని మూసివేస్తామని సర్క్యూలర్ జారీ చేసింది.
అద్దె ఇంట్లో ఉండాలా లేక సొంత ఇల్లు కొనుక్కోవాలా అనేది వ్యక్తుల అవసరాలు, ఆర్థిక లక్ష్యాలు, అభిరుచులపై ఆధార పడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఐటీ చట్టం ప్రకారం, వ్యక్తుల వద్ద ఒకటికి మించి పాన్ కార్డులు ఉండటం నిషిద్ధం. ఇలాంటి వారు తమ వద్ద ఉన్న అదనపు పాన్ కార్డును ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. లేకపోతే రూ.10 వేల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది.
చాలా మందికి వెంటనే డబ్బు అవసరమైతే ఎక్కడి నుండైనా లభించకపోతే వారు లోన్ యాప్స్‌ను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి క్రమంలో లోన్స్(loans) తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
జీవిత బీమా తీసుకునే వారు ఆరు అంశాల ఆధారంగా పాలసీ ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో, బీమా ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందుతాయని అంటున్నారు.